E-Paper
Advertisement

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?
Advertisement

eMudhra Security: నిజానికి ఇంటర్నెట్ వరల్డ్‌లో ఏదైనా సైట్ సేఫ్‌ అని చెప్పడానికి వెబ్‌సైట్‌లకు డిజిటల్ సర్టిఫికెట్లు ఇస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి వెబ్‌సైట్‌ల ఐడెంటిటీ కార్డ్స్ అన్నమాట. మనకి పాస్‌పోర్ట్ ఆఫీస్ ఎలాగో.. డిజిటల్ వరల్డ్‌లో ‘సర్టిఫికేట్ అథారిటీస్’ ఉంటాయి. ఈ-ముద్ర కూడా అలాంటి ఒక పెద్ద కంపెనీయే. ఈ కంపెనీలు వెబ్‌సైట్‌లకు ఒక ‘ప్రైవేట్ కీ’ని కేటాయిస్తాయి. ఇదొక మాస్టర్ కీ లాంటిది. ఇది ఎవరి చేతికి దొరక్కూడదు.. ఎవరూ గెస్ చేయలేనంత డిఫికల్ట్‌గా ఉండాలి.

రూల్ ప్రకారం..

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది! ఈ-ముద్ర కంపెనీ రీసెంట్‌గా క్రియేట్ చేసిన 8 ప్రైవేట్ కీలలో విపరీతమైన లోపాలు ఉన్నట్లు వేన్ అనే ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ కనిపెట్టాడు. రూల్ ప్రకారం ఆ సీక్రెట్ కీ 116 డిజిట్స్ ఉన్న ఒక పెద్ద నంబర్ అయి ఉండాలి. దాన్ని క్రాక్ చేయాలంటే ఒక సూపర్ కంప్యూటర్‌కు కూడా పదుల సంఖ్యలో ఏళ్లు పడుతుంది. కానీ ఈ-ముద్ర జెనరేట్ చేసిన సిస్టమ్‌లో దొర్లిన తప్పు వల్ల.. అవి కేవలం 4, 56, 66, 115, 155, 156, 230, 237 లాంటి సింపుల్ నంబర్లుగా సేవ్ అయ్యాయి!

Advertisement

Also read: వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కీలక సూచనలివే?

కాస్త కష్టమేమో కానీ..

మనం సూట్‌కేస్‌కు పెట్టుకునే 3 డిజిట్ లాక్‌ను ఓపెన్ చేయడం కూడా కాస్త కష్టమేమో కానీ, ఈ డిజిటల్ కీలను కనుక్కోవడం మాత్రం డెడ్ ఈజీ! ఆర్డినరీ కంప్యూటర్ స్క్రిప్ట్ వాడి సెకన్ల వ్యవధిలోనే ఆ కీస్‌ను గెస్ చేసేయొచ్చు. ఈ విషయం తెలియగానే టెక్ వరల్డ్ అలర్ట్ అయింది. రీసెర్చర్ మెయిల్ పెట్టిన రెండు గంటల్లోనే గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌లో ఆ కీస్‌ను ప్లాట్‌ఫారమ్ నుంచి బ్లాక్ చేసింది. ఆ తర్వాత మోజిల్లా, ఆపిల్ కూడా సేమ్ స్టెప్ తీసుకున్నాయి. మన ఇండియన్ ఐటీ మినిస్ట్రీ కూడా దీనిపై ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందాన్ని రంగంలోకి దించింది.

బిగ్ ఫెయిల్యూర్..

Advertisement

టెక్నాలజీ పరంగా జరిగిన ఈ బిగ్ ఫెయిల్యూర్ ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్‌పై విపరీతంగా పడింది. గురువారం ట్రేడింగ్‌లో ఈ-ముద్ర షేర్ ప్రైస్ ఏకంగా 13.62 శాతానికి పైగా పడిపోయింది. గత ఐదు రోలింగ్ సెషన్లలోనే ఈ స్టాక్ ఏకంగా 30.85 శాతం నష్టపోగా, గడిచిన నెల రోజుల్లో ఏకంగా 42.51 శాతం మేర క్రాష్ అయింది! అంటే ఒక్క నెలలోనే ఈ కంపెనీ షేరు దాదాపు 276 రూపాయల వాల్యూను కోల్పోయింది. అయితే ఇక్కడో ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఈ వీక్ కీస్ వల్ల యూజర్లకు ఎలాంటి హాని జరగలేదని గూగుల్ అండ్ సెర్ట్-ఇన్ స్పష్టం చేశాయి.

Also read: భార్య మిస్సయ్యిందని వెళ్తే పోలీసులకే దిమ్మతిరిగే షాక్… 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ – శ్వేత బసు జంటగా నటించిన సిరీస్ స్ట్రీమింగ్

Tags

Related News

కేసీఆర్ ఫామ్‌హౌస్ నీటి కథేంటి? విచారణకు ఎంపీ చామల డిమాండ్!

హైదరాబాద్‌లో 87 నిమిషాల మనీ గేమ్.. దెబ్బకు రూ. 3.34 కోట్లు స్వాహా!

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కీలక సూచనలివే?

Big Stories

Advertisement
×