E-Paper
Advertisement

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!
Advertisement

Business Success Story: కొన్నిసార్లు ఇంట్లో ఉండే చిన్న వంటకాలు కూడా జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. కుటుంబం ద్వారా వచ్చే సంప్రదాయ రుచులు పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేయగలవని బెంగళూరుకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిరూపించారు. తమ అమ్మమ్మ నేర్పిన స్పెషల్ బిర్యానీ రెసిపీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన రమ్య రవి, శ్వేత రవిల ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం రూ. 5 లక్షల పెట్టుబడితో మొదలైన ఈ ‘ఆర్ఎన్ఆర్ దొన్నె బిర్యానీ’ (RNR Donne Biryani) ప్రయాణం.. నేడు రూ. 10 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది.

లాక్‌డౌన్‌లో మొదలైన ప్రయాణం

కర్ణాటక శైలిలో అమ్మమ్మ చేసే దొన్నె బిర్యానీ రుచిని తింటూ పెరిగిన ఈ ఇద్దరు సోదరీమణులకు.. ఆ రుచిని బెంగళూరు నగరమంతటా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే 2020 నవంబరులో కొవిడ్-19 సమయంలోనే వారు ఈ వెంచర్‌ను ప్రారంభించారు. బెంగళూరులో కేవలం 200 చదరపు అడుగుల స్థలంలో ఒక క్లౌడ్ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. రూ. 5 లక్షల ప్రారంభ పెట్టుబడి, ఒకే ఒక్క వంటమనిషి, కొద్దిమంది సహాయకులతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

మొదటి నెలలోనే రికార్డు స్థాయి ఆర్డర్లు

Advertisement

వ్యాపారం ప్రారంభించిన మొదటి నెలలోనే ఏకంగా 10,000లకు పైగా ఆర్డర్లు రావడంతో ఈ వెంచర్‌కు బలమైన పునాది పడింది. ఆ తర్వాత వారు వెనుదిరిగి చూసే అవకాశమే రాలేదు. ఖరీదైన రెస్టారెంట్ల కోసం భారీగా పెట్టుబడులు పెట్టకుండా డెలివరీ-ఫస్ట్ పద్ధతిని ఎంచుకుని తమ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించారు. అంతేకాకుండా ఆహారాన్ని అరటి ఆకులో చుట్టి, ఒక ప్రత్యేకమైన టిన్ బాక్స్‌లో ప్యాక్ చేయడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకున్నారు. ఈ ప్రత్యేకత వారి బ్రాండ్‌కు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

రూ. 10 కోట్ల టర్నోవర్

కాలక్రమేణా ‘ఆర్ఎన్ఆర్ దొన్నె బిర్యానీ’ బ్రాండ్ 14 క్లౌడ్ కిచెన్‌లుగా, ఒక స్టాండ్‌అలోన్ రెస్టారెంట్‌గా విస్తరించింది. ప్రస్తుతం ఈ వ్యాపారం ద్వారా దాదాపు రూ. 10 కోట్ల వార్షిక టర్నోవర్ సాధిస్తున్నారు. బిర్యానీ మాత్రమే కాకుండా, డ్రమ్‌స్టిక్ చిల్లీ స్టార్టర్స్, ఘాటైన మటన్ బోన్ సూప్, చికెన్ ఘీ రోస్ట్ వంటి రుచికరమైన వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. భోజనం అయ్యాక నీటిని తీపి చేసేందుకు ‘ఎళనీరు పాయసం’ (కొబ్బరి పాయసం) కూడా అందిస్తున్నారు.

Advertisement

Also Read: అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

కిచెన్ మెనూ ధరలు..

ప్రస్తుతం ‘ఆర్ఎన్ఆర్ దొన్నె బిర్యానీ’ కిచెన్ మెనూలో శాకాహార, నాన్-వెజ్ బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. రూ.269 నుంచి రూ.349 ధరల్లో అవి లభిస్తున్నాయి. మటన్ బిర్యానీ ధర రూ. 419గా ఉంది. మెుత్తంగా అమ్మమ్మ నేర్పిన వంటకంతో మొదలైన చిన్న ఆలోచన.. రమ్య, శ్వేతా సిస్టర్స్ ను తిరుగులోని స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు. పట్టుదల ఉంటే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించవచ్చని వీరిద్దరు నిరూపించారు.

Also Read: 8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

Tags

Related News

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

Big Stories

Advertisement
×