BigTV English

Discount on Toyota Cars: ఈ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల తగ్గింపు.. ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకే!

Discount on Toyota Cars: ఈ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల తగ్గింపు.. ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకే!

Rs 1.5 Lakhs Discount on Toyota Cars: ప్రస్తుతం మార్కెట్‌లో కార్లకు మంచి డిమాండ్ ఉంది. వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో మరికొన్ని కంపెనీలు తమ మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి.


ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కంపెనీ తమ మోడళ్లపై ఏప్రిల్‌లో భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. కంపెనీ ఇటీవల రూ.7.74 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో టయోటా టైసర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

అయితే ఇప్పుడు భారతీయులకు కంపెనీ మరో శుభవార్త అందించింది. ఏప్రిల్ 2024లో అనేక టయోటా వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. దీంతో ఈ సమయంలో కార్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసేవారు ఇప్పుడు చాలా ఆదా చేసుకోవచ్చు.


ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌లతో చౌక ధరలో కార్‌ను కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. అయితే ఏ ఏ మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: బాలెనో లుక్‌తో మారుతి స్విఫ్ట్.. ఫీచర్లు మాములుగా లేవు!

టయోటా కార్లపై తగ్గింపు:

టయోటా గ్లాంజా:

టయోటాకు చెందిన గ్లాంజా సుమారు రూ.40,000 విలువైన ప్రయోజనాలతో ఏప్రిల్ 2024లో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపు లేదు. కేవలం రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే రూ.20,000 ఉచిత యాక్సెసరీస్ తగ్గింపును పొందే అవకాశం ఉంది.

అయితే ఇది కాకుండా.. ఈ టయోటా గ్లాంజాపై పొడిగించిన వారంటీ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. దీని ధర విషయానికొస్తే.. టయోటా గ్లాంజా ప్రారంభ ధర రూ.6.86 లక్షలు. ఇది రూ.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వరకు ఉంది.

టయోటా క్యామ్రీ:

టాయోటా క్యామ్రీపై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.1.50 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు పొడిగించిన వారంటీని కూడా అందిస్తుంది. కాగా ఈ క్యామ్రీ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.46.17 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది.

Also Read: దూకుడు పెంచిన మారుతి.. ఏకంగా మొదటి స్థానం కొల్లగొట్టింది

టయోటా అర్బన్ క్రూయిజర్ హైబ్రిడ్‌:

టయోటా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో అర్బన్ క్రూయిజర్ హైబ్రిడ్‌పై ఒకటి. ఈ కారుపై కూడా తగ్గింపు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఏకంగా రూ.57,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇందులో నగదు తగ్గింపు లేదు.

కేవలం ఎక్స్చేంజ్ బోనస్ రూ.30,000, రూ.27,000 విలువైన ఉచిత ఆఫ్ కాస్ట్ యాక్సెసరీలను మాత్రమే పొందే అవకాశం ఉంది. అయితే CNG, స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లపై ఎలాంటి ఆఫర్‌లు లేవు. ఈ తగ్గింపు ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అయితే వీటికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ సమీపంలోని డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×