Big Stories

Top Selling Cars in March: దూకుడు పెంచిన మారుతి.. ఏకంగా మొదటి స్థానం కొల్లగొట్టేసింది..!

Top Selling Cars in March 2024: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రయాణికుల వాహనాల జోరు కొనసాగుతుంది. FY 2024 ఫేస్‌లో మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి ప్రముఖ వాహన తయారీ కంపెనీలు మార్చి 2024లో బలమైన సేల్స్‌ను నమోదు చేశాయి. మొత్తం పరిశ్రమ గణాంకాల్లో 42.51 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా ఎస్‌యూవీల అమ్మకాలు 21,46,409 యూనిట్ల అమ్మకాలతో పెరిగాయి. ఇది ఏకంగా 27.2 శాతం వృద్ధిని చూపిస్తుంది.

- Advertisement -

దీని తర్వాత సెడాన్ కార్లు అమ్మకాల పరంగా రెండవ స్థానంలో నిలిచాయి. 3,80,135 యూనిట్ల సెడాన్ కార్లు విక్రయించబడ్డాయి. అయితే 5.9 శాతం క్షీణత నమోదైంది. అదేవిధంగా కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా క్షీణించాయి.1,173,285 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది 12.4 శాతం విక్రయాలు తగ్గాయి.

- Advertisement -

Also Read: మీ సీఎన్‌జీ మైలేజ్ ఇవ్వడం లేదా.. అయితే ఈ టిప్స్ పాటించండి!

మారుతి సుజుకి దేశీయ ప్యాసింజర్ వెహికల్ సేల్స్‌లో మార్చి 2024లో 15 శాతం వృద్ధితో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ 1,52,718 యూనిట్లను విక్రయించగా.. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 1,32,763 యూనిట్లుగా ఉంది. దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ వృద్ధిని సాధించింది. మార్చిలో అమ్మకాలు 50,297 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది కాలంలో 44,225 యూనిట్ల కంటే 14 శాతం ఎక్కువగా ఉంది.

MG మోటార్ ఇండియా మార్చి 2024లో అమ్మకాలలో సంవత్సరానికి తగ్గుదలని చవిచూసింది. మార్చి 2023లో 6,051 యూనిట్లు విక్రయించగా 4,648 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 23 శాతానికి పైగా క్షీణతను చూపుతోంది. టయోటా భారతదేశంలో 25,119 వాహనాలను విక్రయించింది. 2,061 యూనిట్లను ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే. ఇది 21,783 యూనిట్ల విక్రయాలతో 25 శాతం వృద్ధిని సాధించింది.

Also Read: భారత మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీలు ఇవే..!

మహీంద్రా నెలవారీ విక్రయాలలో వృద్ధిని నమోదు చేసింది. దేశీయ విక్రయాలలో 40,631 ప్యాసింజర్ వాహనాలు సేల్ చేసింది. ఇది మార్చి 2023తో పోలిస్తే 13 శాతం వృద్ధిని చూపుతుంది. హోండా కార్స్ ఇండియా మార్చి 2024లో 6,860 యూనిట్ల ఎగుమతి సంఖ్యలతో పాటుగా 7,071 యూనిట్ల నెలవారీ దేశీయ విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ మార్కెట్‌లో 6,692 యూనిట్లను విక్రయించింది. మార్చి 2023లో 3,189 యూనిట్లను ఎగుమతి చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News