BigTV English

New Maruti Swift 2024 Look: బాలెనో లుక్‌తో మారుతి స్విఫ్ట్.. ఫీచర్లు, లుక్స్ రెండు అదుర్స్!

New Maruti Swift 2024 Look: బాలెనో లుక్‌తో మారుతి స్విఫ్ట్.. ఫీచర్లు, లుక్స్ రెండు అదుర్స్!

New Maruti Swift 2024 Looks Like a Baleno: భారతదేశంలో అతిపెద్ద వాహనాల తయారీ సంస్థల్లో మారుతి సుజుకి ఒకటి. కంపెనీ దేశంలోనే అత్యంత చౌకైన కార్లను అందిస్తోంది. ఇటీవలే సంస్థ సేల్స్‌లో కూడా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మారుతి సుజుకి లవర్స్ దేశంలో ఎక్కువగానే ఉంటారు. రోడ్డపై ఎటుచూసిన ఈ కంపెనీకి చెందిన కార్లే దర్శరనమిస్తాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.  అతిపెద్ద లాంచ్‌గా రాబోయే నెలల్లో కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ కారులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.


రాబోయే కొత్త జనరేష్ స్విఫ్ట్ ఇప్పటికే జపాన్, ఐరోపాలో అమ్మకానికి ఉంది. దీని ఇంటీరియర్ దేశంలోని బాలెనో, ఫ్రంట్ బ్రెజ్జా వంటి కొత్త మారుతి సుజుకి కార్లను పోలి ఉంటుంది. ఈ స్విఫ్ట్‌లో LED హెడ్‌లైట్లు టెయిల్-లైట్లు, LED DRLలు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ వింగ్ మిర్రర్స్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఫ్రీ-స్టాండింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.

Also Read: దూకుడు పెంచిన మారుతి.. ఏకంగా మొదటి స్థానం కొల్లగొట్టింది


New Maruti 2024
New Maruti 2024

అలాగే ఈ కొత్త రకం స్విఫ్ట్‌లో భద్రత కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటర్, EBD, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్ అలాగే లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ADAS ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: కియా నుంచి లాంచ్ కానున్న కార్లు ఇవే..!

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ కోసం అధికారిక లాంచ్ తేదీని వెల్లడించలేదు. అయితే ఇది కొన్ని నెలల్లో విడుదల కానుంది. కొత్త డిజైర్ కూడా లాంచ్ అయిన కొంత సమయం తర్వాత లాంచ్ అవుతుంది. అయితే కొత్త స్విఫ్ట్ అన్ని మార్పులు, కొత్త ఫీచర్ల కారణంగా కొంచెం ఖరీదైనదిగా చెప్పాలి. మారుతి స్విఫ్ట్ ప్రస్తుత ధర రూ.5.99 లక్షల నుండి రూ.9.03 లక్షల మధ్య ఉంది. దీని పోటీ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగోతో కొనసాగుతుంది.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×