BigTV English

RCB Vs SRH Match Preview: సన్‌రైజర్స్ హ్యాట్రిక్ కొట్టేనా..? నేడు ఆర్సీబీతో హైదరాబాద్ ఢీ..!

RCB Vs SRH Match Preview: సన్‌రైజర్స్ హ్యాట్రిక్ కొట్టేనా..? నేడు ఆర్సీబీతో హైదరాబాద్ ఢీ..!

IPL 2024 – Royal Challengers Bengaluru Vs Sunrisers Hyderabad: ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఘోర పరాజయాల బాటలో ఉన్న జట్టు ఏదయ్యాంటే ఆర్సీబీ అని ఠక్కున చెబుతారు. అతిరథ మహారథులున్న జట్టు పాయింట్ల టేబుల్ పట్టికలో అట్టడుగున ఉందంటే అందరికీ నమ్మశక్యం కావడం లేదు. దీనినెలా అభివర్ణించాలో తెలీడం లేదని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.


ఐపీఎల్ 2024 సీజన్ లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్న స్వామీ స్టేడియంలో జరగనుంది.

ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ ఒకటి గెలిచి, ఐదు ఓడిపోయింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 5 మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి, రెండు ఓటమి పాలైంది. పాయింట్ల టేబుల్ పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఈరోజు పరిస్థితిని బట్టి చూస్తే ప్రస్తుతం రేస్ లోనే ఉందని చెప్పాలి.


ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 23 మ్యాచ్ లు జరిగాయి. 12 మ్యాచ్ ల్లో హైదరాబాద్ విజయం సాధిస్తే, బెంగళూరు 10 మ్యాచ్ లు గెలిచింది. ఒక దాంట్లో ఫలితం రాలేదు.

Also Read: IPL 2024 RCB vs SRH Highlights: సన్ రైజర్స్ మళ్లీ దంచికొట్టారు.. ఆర్సీబీపై ఘన విజయం

ఆర్సీబీ విషయానికి వస్తే మొదట్లో ఆశావాహ ద్రక్పథంతో మొదలుపెట్టింది. తర్వాత నీరుగారిపోయింది. ఒకరు బాగా ఆడితే ఒకరు దానిని అందుకోవడం లేదు. తర్వాత బౌలింగు చాలా వీక్ గా ఉంది. ముఖ్యంగా టీమ్ ఇండియాలో ఆడే సిరాజ్ బౌలింగు అత్యంత దారుణంగా ఉంది. వికెట్ల సంగతి పక్కన పెడితే పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నాడు.

అందరినీ గౌరవిస్తున్నారు. సిరాజ్ బౌలింగుని మాత్రం టార్గెట్ చేసుకుని ఎటాక్ చేస్తున్నారు. ఎక్కడ లోపం జరుగుతుందో సిరాజ్ గుర్తించాలి. లేకపోతే కెరీర్ డేంజర్ లో పడే ప్రమాదం ఉంది. అయితే ప్రాబ్లం ఏమిటంటే అందరూ సిరాజ్ బాటలోనే నడుస్తున్నారు. ఈ భారమంతా ఆర్సీబీ బ్యాటర్లపై పడుతోంది. మొత్తం వీరే మోయాలంటే వారి వల్ల కావడం లేదు. మరి ఈసారైనా లోపాలు సరిచేసుకుని బౌలర్లు ఆడతారా? లేదా చూడాలి.

Also Read: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..

హైదరాబాద్ సన్ రైజర్స్ విషయానికి వస్తే కెప్టెన్ కమిన్స్ వచ్చిన తర్వాత జట్టులో వ్యూహాలు ఫలిస్తున్నాయి. తనని అత్యంత ధర పెట్టి కొన్నందుకు తగిన న్యాయం చేస్తున్నాడు. ఎక్కడో అట్టడుగున ఒకప్పుడు ఉన్న జట్టుని మొత్తానికి లైనులో పెట్టాడు. టీమ్ స్పిరిట్ తో ముందుకెళుతున్నాడు. మరి ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించి నిలబడతాడా లేక తడబడతాడా? అనేది చూడాలి.

Tags

Related News

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Big Stories

×