Labour Card: లేబర్ కార్డు అంటే ఎమిటి? ఇది దేనికి ఉపయొగ పడుతుంది. ఈ కార్డుతో కలిగే లాభాలు ఎమిటి? ఇది ఎలా ఉంటుంది. అనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. నిజానికి ఈ కార్డు వలన చాలా ఉపయోగాలున్నాయి. అటు ప్రభుత్వ పథకాలకు మరియు వక్తిగత జీవితంలో లేబర్ క్యాటగిరికి చెందిన ప్రతి ఓక్కరికి దీని వలన చాలా లాభాలున్నాయి. అయితే దీని గురించి కొంత మందికి మాత్రమే తెలుసు. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
అసంఘటిత రంగం కార్మికులకు మరియు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు అని అంటారు. దీని ద్వారా కార్మికులకు సమాజిక, ఆర్థిక సహయం, సంక్షేమ పథకాలకు సభందిచించిన అన్నీ రకాల సేవలు అందుతాయి. తెల్ల రేషన్ కార్డు కలిగి కార్మక రంగంలోకి వచ్చే అన్ని వర్గాల వారు దీని కిందికి వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ప్రభుత్వం అందించే లేబర్ కార్డ్ (Labour Card) అనేది చాలా ముఖ్యమైన్ సంక్షేమ పథకాల కోసం ఉపయోగపడే గుర్తింపు పత్రంగా చెల్లుతుంది. ఈ కార్డు ద్వారా కార్మికులకు ప్రమాదం, మరణం, ప్రసూతి వంటి అనేక పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.
లేబర్ కార్డు కలిగి ఉన్న కార్మికుడు ఎతైనా పనిలో గాయ పడిన లేదా ప్రమాదం(Accident)నికి గురైనా వారికి ప్రభుత్వం నుండి వైద్య ఖర్ఛులకోసం ఆర్థక సభయం అందిస్తుంది. కార్మకుడికి తగిలిన గాయాల తీవ్రతను బట్టి నష్ట పరిహారం కూడా ప్రభుత్వం అందిస్తుంది. ప్రయాదం జరిగిరప్పుడు దానికి సంభందించిన పూర్తివవరాను ప్రభుత్వం అధికారుల వద్దకు తీసుకెల్తే దాని ద్వాకా వచ్చే బెన్ ఫిట్స్ పొందవచ్చు.
Also Read: గ్రామీణ మహిళలకు లైఫ్ సెట్ అయ్యే సూపర్ ఛాన్స్.. ప్రతి నెల 7 లక్షలు లాభం..!
కార్డు కలిగిన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్ట ఆర్థిక సహాయం మోత్తం వారికి అందుతుంది. దీంతో ఆ కుడటుంబానికి కొంత ఆర్థిక భరోసా దొరుకుతుంది. కార్మికుడి పూర్తి విరాలు సేకరించి అనంతరం ప్రభుత్వం వద్దకు పూర్తి వివరాలతో మొత్తం సొమ్మును వారి కుటుంబానికి అందిస్తారు.
లేబర్ కార్డు కలిగి ఉన్న కార్మికుడి భార్యకు ప్రసూతి సమయంలో కూడా ప్రభుత్వం నుంచి కొంత నగదు సహాయం అందుతుంది. దీంతో ఈ సహాయం గర్భిణీ ఆరోగ్యం, శిశు సంరక్షణకు ఎతగానో ఉపయోగపడుతుంది. హస్పిటల్(Hospital) లో సైతం ఈ కార్డు కలిగిన వారికి కొన్ని ప్రత్యేక సమయాలలో ఉచితంగా చికిత్స అందిస్తారు. దీంతో కార్మికుడి భార్యకు కొంత వరకు సహయ పడుతుంది.
కార్మికుడి కూతురు పెళ్లి సమయంలో కూడా ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం మనం పొందవచ్చు. పెళ్లి ఖర్చులను తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు, అత్యక్రియల ఖర్చులు, ఆరోగ్యభీమా సదుపాయాలతో పాటు కొన్ని ప్రత్యేక మైన పథకాలలో కూడా మినహఇంపులకు అర్హుత కలిగి ఉంటారు.
Also Read: బండి బగీరథ్ కేసులో.. హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్!