E-Paper
Advertisement

ఆ కిక్కే వేరు.. వెంటాడుతాం-వేటాడుతాం, సీఎం చంద్రబాబు నోటి వెంట పవన్-ప్రభాస్ డైలాగ్స్

ఆ కిక్కే వేరు.. వెంటాడుతాం-వేటాడుతాం, సీఎం చంద్రబాబు నోటి వెంట పవన్-ప్రభాస్ డైలాగ్స్
Advertisement

Nellore: సీఎం చంద్రబాబు రూటు మార్చారు.. నిత్యం ప్రభుత్వం, పథకాల గురించి చెబితే ప్రజల్లో ఉత్సాహం రాదని భావించారు. ఈసారి వెరైటీగా సినిమా తరహాలో డైలాగ్స్ చెప్పడంతో సభకు వచ్చినవారు ఈలలు, చప్పట్లతో ఆ సభ మార్మోగిపోయింది. స్టార్ హీరోలు పవన్‌కళ్యాణ్, ప్రభాస్ డైలాగ్స్ సీఎం చంద్రబాబు చెప్పడం కొసమెరుపు.

సీఎం చంద్రబాబు నోటి వెంట పవన్-ప్రభాస్ డైలాగ్స్

Advertisement

మంగళవారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో ‘మత్స్యకారుల సేవలో’ అనే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా, ప్రభాస్ నటించిన ఛత్రపతి మూవీలో డైలాగ్స్ వదిలారు.

ఛత్రపతి ఫిల్మ్‌లోని తీరం మనదే.. బోటు, వేటా మనదేనని చెప్పారు సీఎం చంద్రబాబు. అలాగే పవన్ డైలాగ్ ఆ కిక్కే వేరని చెప్పగానే సభంతా ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది. రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని విమర్శించారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేయడం మొదలుపెట్టారన్నారు.

Advertisement

కావలి నియోజకవర్గంలో ‘మత్స్యకారుల సేవలో’  సీఎం చంద్రబాబు

బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మర్డర్ వరకు అంతా కుల-మత రాజకీయాలేనని అన్నారు. గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాడుతాయని, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయని అన్నారు. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. మన జీవితాలను బాగు చేసుకోవాలన్నారు. తాను చెప్పిన నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలన్నారు.

తీరం మనదే.. బోటు మనదే.. వేట మనదే.. జీరో టాలరెన్స్ మనదేనని అన్నారు. తీర ప్రాంతంలోకి ఎవరైనా వస్తే వెంటాడుతాం.. వేటాడుతామన్నారు. ఎవర్నీ అనుమతించేది లేదన్నారు. ఎవరి హక్కులు వారు కాపాడుకోవాలన్నారు. వారి కోసం మన జీవనోపాధి కోల్పోవడానికి కరెక్టు కాదన్నారు. పొరుగు రాష్ట్రాల వారు రావటానికి వీల్లేదని, పూర్తిగా నిఘా పెడతామన్నారు.

బోర్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తామన్నారు. శాటిలైట్ నిత్యం తిరుగుతూ ఉంటుందన్నారు. బోటు ఎంటర్ కాగానే మెసేజ్ వస్తుందని, అక్కడి నుంచి ఎవర్నీ అనుమతించేది లేదన్నారు. రాబోయే 18 నెలల్లో తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ పరిశ్రమ రాబోతోందని, మన ప్రభుత్వం కూడా అదే బులెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తుందన్నారు.

ALSO READ: మనసు మార్చుకున్న బాలినేని.. సీఎం చంద్రబాబుతో భేటీ వెనుక, మేటర్ అదేనా.. మరి ఎప్పుడు?

మత్స్యకారుల సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. వేట నిషేధ కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ. 20 వేల చొప్పున రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్టు తెలిపారు. సముద్రంలో చేపల వేట అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమేనన్నారు.

ఏప్రిల్ 15- జూన్ 14 మధ్య వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చేయూత ఇస్తున్నట్లు వివరించారు. గతంలో రూ.10 వేలున్న ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెంచిందన్నారు.  మత్స్యకారుల అభివృద్ధికి 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఆర్థికంగా బలపడుతుందన్నారు. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. నార్త్ బకింగ్‌హామ్ కెనాల్ పూడికతీత పనులు చేపడతామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×