E-Paper
Advertisement

Bigg Boss 9 Thanuja: ఓటమి తర్వాత తనూజ ఫస్ట్‌ రియాక్షన్‌.. ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌!

Bigg Boss 9 Thanuja: ఓటమి తర్వాత తనూజ ఫస్ట్‌ రియాక్షన్‌.. ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌!
Advertisement

Bigg Boss 9 Thanuja: ఈసారి లేడీ విన్నర్‌గా నిలిచి బిగ్‌బాస్‌ చరిత్రలో కొత్త ఆధ్యాయనంకు నాంది పలుకుందని అనుకున్నారు. రణరంగంగా జరిగిన ఈ రియాలిటీ షోలో శివంగిలా రెచ్చిపోయింది. ఆడతనంలో కూడా ఆటతనం చూపించింది. ఆకట్టుకునే కట్టుబొట్టు.. అందరమైన దరహాసం.. బుగ్గలు ఎర్రపడేంత కోపం.. పట్టుదల ఇలా హౌజ్‌లో నవరసాలు పలకించింది ఈ ముద్దమందారం. హౌజ్‌లో ఎన్ని చాలేంజస్‌ ఎదురైన ధైరంగా నిలబడింది. బాండింగ్స్‌ పేరుతో మనుషులు వాడుకుంటున్నావంటూ ఎంతోమంది విమర్శించిన ఆత్మస్థైర్యం చూపించింది. ప్రతి టాస్క్‌లో గట్టి పోటీ ఇస్తూ కంటెస్టెంట్స్‌కి చుక్కలు చూపించింది. ఎన్ని సవాళ్లు ఎదురైన ఎక్కడ తడపడకుండ 105 రోజుల పాటు బిగ్‌బాస్‌ 9 సీజన్‌లో టాప్‌లో రాణించింది తనూజ.

Advertisement

ప్రతి విషయంలో బ్యాలెన్స్‌గా రాణించిన తనూజే ఈ సీజన్‌ విన్నర్‌ ఫ్యాన్స్‌ అంతా ఆశపడ్డారు. కాన, ఒక్క అడుగు దూరంలో టైటిల్‌ ఆమె చేయి జారింది. హౌజ్‌లో ఇద్దరి స్నేహితుల మధ్యే టైటిల్‌ పోరు నడించింది. ఇందులో కామనర్‌ కళ్యాణ్‌ గెలిచి.. బిగ్‌ బాస్‌ 9 సీజన్‌ టైటిల్‌ అందుకున్నాడు. మొదటి నుంచి చివరి రన్నరప్‌ వరకు తనూజ ఎక్కడ తడబడలేదు. ఆఖరికి టైటిల్‌ చేజారిని ఆమె ముఖంలో చిరు నవ్వు చెదరలేదు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో 105 రోజుల పాటు తనదైన ఆటపాటతో ఎంటర్‌టైన్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. బయటకు వచ్చాక తన బిగ్‌బాస్‌ జర్నీపై తొలిసారి స్పందింది. రన్నర్‌గా బయటకు వచ్చిన ఆమె తొలి స్పందనను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో సుదీర్ఘ నోట్‌ షేర్‌ చేసింది.

బిగ్‌బాస్‌ కి థ్యాంక్స్

“బిగ్‌బాస్‌ సీజన్‌కు 9కి థాంక్స్‌.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్‌బాస్‌ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను.. కానీ, తిరిగి లేచిన ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్క్‌ నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా.. నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది. మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను” అంటూ రాసుకొచ్చింది.

Advertisement

Also Read: Dhurandhar Movie : పాకిస్థాన్‌లో దురంధర్ మూవీ రచ్చ రచ్చ… గత 20 ఏళ్లల్లో ఇదే తొలిసారి

గుణపాఠం నేర్చుకున్నా..

మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్‌, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి. మీలో ఒకరిగా హౌస్‌లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్‌బాస్‌ 9కి ముగింపు పలుకుతున్నాను అని తన పోస్టులో పేర్కొంది. ఇది చూసిన అభిమానులు తనూజ ఆట తీరు, హౌజ్‌ ఆమె హుందాతనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కప్పు గెలవకపోయినా ఎంతోమంది ప్రజల ప్రేమాభిమానులు పొందావు.. నువ్వు నిజమైన ఫైటర్‌వి అని తనూజని కొనియాడుతున్నారు. అంతేకాదు బిగ్‌బాస్‌లో తనలా తాను ఉంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపావంటూ తనూజను పొగడ్తలతో ముంచెత్తున్నారు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×