Krishnappa Gowtham Retirement: టీమ్ ఇండియాకు చెందిన మరో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ ( Krishnappa Gowtham ) 14 ఏళ్ల తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం 37 సంవత్సరాలు ఉన్న కృష్ణప్ప గౌతమ్, ఐపీఎల్ తో పాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లో పాల్గొంటున్నాడు. అయితే ఏజ్ పైబడిన నేపథ్యంలో తాజాగా రిటైర్మెంట్ ఇస్తూ సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాకుండా విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు కృష్ణప్ప గౌతమ్. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరఫున ఒకే ఒక్క వన్డే ఆడాడు కృష్ణప్ప గౌతమ్. 2001 జూలైలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా తరఫున బరిలోకి దిగి ఆ తర్వాత జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేశాడు కృష్ణప్ప గౌతమ్ ( Krishnappa Gowtham retirement).
Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే
37 ఏళ్ల కర్ణాటక స్టార్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియాలో అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో పెద్దగా అవకాశాలు ఈ మధ్య రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వయస్సు రిత్యా కూడా రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ 14 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాడు. 2009లో అరంగేట్రం చేశాడు కృష్ణప్ప గౌతమ్. ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై మ్యాచ్ ఆడాడు. 2024 ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ కూడా ఆడేశాడు. చివరగా లక్నో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు కృష్ణప్ప గౌతమ్. ఆ తర్వాత ఐపీఎల్లో కనిపించలేదు. ఇటు 2021 సంవత్సరంలో జూలై 23వ తేదీన శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో టీమిండియా జట్టు తరఫున బరిలోకి దిగాడు కృష్ణప్ప గౌతమ్. ఆ సందర్భంగా బ్యాటింగ్ చేసిన కృష్ణప్ప గౌతమ్ కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించాడు. అలాగే ఓ వికెట్ కూడా తీసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కృష్ణప్ప గౌతమ్ అద్భుతంగా రానించాడు. ఇప్పటి వరకు ఐపిఎల్ లో మొత్తం 36 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు కృష్ణప్ప గౌతమ్. ఇందులో 21 వికెట్లు తీసిన కృష్ణప్ప గౌతమ్ 247 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్
🚨 RETIREMENT 🚨
Karnataka's K Gowtham has announced his retirement from cricket pic.twitter.com/BgWPtxwf7Q
— Cricbuzz (@cricbuzz) December 22, 2025