Gujarat Crime: గుజరాత్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్మదా నదీ కెనాల్‌లో వారి మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగింది? సూసైడ్ చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య
గుజరాత్‌లోని బోరిసానా గ్రామానికి చెందిన ధీరజ్ రబారీ వ్యాపారి. ఆయనకు వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు ఉన్నాయి. మరి ఫ్యామిలీలో ఏమైనా జరిగిందా? లేక వ్యాపారంలో నష్టాలు వచ్చాయా? అనేది తెలీదు. శుక్రవారం ఉదయం బలరామ్ పార్క్ సొసైటీలోని తన ఇంటి నుండి తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి-జియాలకు ఆధార్ కార్డుల కోసం ఇంటి నుంచి బయలుదేరాడు.
ఘటనకు ముందు ధీరజ్ తన తండ్రికి ఫోన్ చేసి పావుగంటలో ఇంటికి వస్తానని ఫోన్ చేసి ఫ్యామిలీ చెప్పాడు. కొద్దిసేపటికే తన స్నేహితుడికి మొబైల్ ఫోన్‌కి పాస్‌వర్డ్‌తో పాటు కెనాల్ లొకేషన్‌ను మెసేజ్ రూపంలో ధీరజ్ పంపినట్లు సమాచారం. రాత్రి అయ్యేవరకు ధీరజ్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఫ్యామిలీ సమస్యలే ఆత్మహత్యకు కారణమా?
ఈ క్రమంలో ధీరజ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ధీరజ్ కోసం పలు బృందాలుగా విడిపోయారు. చివరకు సెల్‌ఫోన్ ద్వారా చివరి కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు.
చివరకు శనివారం ఉదయం నర్మదా కెనాల్‌లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గుర్తించారు పోలీసులు. మరి ధీరజ్ ఎక్కడా అన్నది అసలు ప్రశ్న. మధ్యాహ్నం ఆ కెనాల్‌లో ధీరజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ కెనాల్‌లో ధీరజ్ ఉపయోగించిన కారు కనుగొన్నారు. స్థానిక ఈతగాళ్ల సహాయంతో ధీరజ్ మృతదేహాలను బయటకు తీశారు.
ALSO READ: ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు
పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధీరజ్ కుటుంబం ఆర్థికంగా ఎంతో బలంగా ఉందని, వడ్సర్, కలోల్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ధీరజ్ తోపాటు ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య వెనుక కారణం ఏంటి?
ఫ్యామిలీలో అంతర్గత సమస్యలా? వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? కారు డ్రైవింగ్ సమయంలో వెనుక నుంచి ఏమైనా వాహనం వచ్చి ఢీ కొట్టిందా? ప్రత్యర్థుల నుంచి ధీరజ్ పొంచిన ముప్పా? తాను లేని లోకంలో పిల్లలు ఉండకూడదని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఫ్యామిలీ సమస్యలే కారణమా? అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.