Four Legged Rooster: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత కోడిపుంజు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కోడిపుంజు అంటే సాధారణంగా రెండు కాళ్లు, ఒక తల, రెండు రెక్కలు ఉండటం సహజం. కానీ ఈ కోడిపుంజు మాత్రం నాలుగు కాళ్లతో జన్మించింది! ఈ విచిత్రమైన కోడి ఇప్పుడు స్థానికులను కాకుండా, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కోడిపుంజు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యర్ధి కోడిపుంజుతో కోట్లాడేందుకు మరో రెండు కాళ్ళను దువ్వుతుంది. ఏంటీ కోడిపుంజు ప్రత్యేకత, ఇంతకీ ఎక్కడా ఉంది ఆ కోడిపుంజు వాచ్ థిస్ స్టోరీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం గ్రామానికి చెందిన నరదల నాగరాజు అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం తన తోటలో పందెం పుంజులు పెంపకం ప్రారంభించాడు.
వేరే ప్రాంతం నుండి కొని తెచ్చిన పుంజులలో ఒక పుంజుపిల్ల విచిత్రం గా ఉండటంతో దానిని శ్రద్దగా ఇంట్లో చంటిపిల్లల సాగుతూ వచ్చాడు,,కాలక్రమేనా కోడిపుంజు పెద్దదిగా మారి పందెంకోడిలా ఎదిగింది.
కోడిపుంజు ఇంకా కొద్దీ నెలలలో సంక్రాంతి పండుగ వస్తున్నందున కోడి పందెలా రాయుళ్లు తన దగ్గరకు వచ్చే పందెం రాయుళ్లను ఆకట్టుకుంటుంది..
ఎందుకంటే ఈ పుంజు నాలుగు కాళ్లతో జన్మించి,మంచి హుషారుగా ఉండటం చూసి,వామ్మో ఇదేం పుంజు ఒకవేళ కోడి పందెలలో పాల్గొంటే దీని కి ఎక్కడ కత్తులు కట్టాలి,దీన్ని చూసి మిగతా పుంజులు పోరాడగలవా అని చమత్కరించుకుంటున్నారు..
ఈ నాలుగు కాళ్ల పుంజు గురించి తెలిసిన వారందరూ దీన్ని చూడటానికి ఎగబడుతున్నారు,ఏమైనా బ్రహ్మం గారు చెప్పినట్లే జరుగుతుందని కొందరు ఇదేం వింతరా బాబు అని అనుకుంటుంటే.. మరికొందరు ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడలో అని చెవులుకోరుకుంటున్నారు.
Also Read: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి: గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారనే ఆరోపణలు
సాధారణంగా జంతువుల్లో ఇలాంటి అదనపు అవయవాలు పుట్టుకతోనే వచ్చే జెనెటిక్ మ్యూటేషన్ (Genetic Mutation) వల్ల సంభవిస్తాయి. సాధారణంగా ఇలాంటి జంతువులు ఎక్కువ రోజులు బతకవని నిపుణులు చెబుతారు. అయితే ఈ కోడిపుంజు మాత్రం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. అదే దీని ప్రత్యేకత.