Karnataka Tour: కర్ణాటక రాష్ట్రం చారిత్రక కట్టడాలు, పచ్చని పర్వతాలు, కాఫీ తోటలు, తీర ప్రాంతాలతో నిండిన అద్భుతమైన పర్యాటక కేంద్రం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అనేక ప్రాంతాలు ఉన్నాయి. మూడు రోజుల టూర్ లో భాగంగా ఇక్కడి అనేక టూరిస్ట్ ప్లేస్‌లను చూడొచ్చు. కర్ణాకటలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రకృతి ప్రేమికులకు: కూర్గ్ – చిక్మగళూరు మార్గం:
పచ్చని కొండలు, కాఫీ తోటలు ప్రశాంతమైన జలపాతాలను ఇష్టపడే వారు ఈ ప్లేస్ తప్పకుండా చూడాలి.
కూర్గ్ (Coorg) – భారతదేశపు స్కాట్లాండ్ (Day 1 & Day 2 )
పొగమంచుతో కప్పబడే కొండలు, విస్తారమైన కాఫీ తోటలు , ప్రశాంతమైన వాతావరణం కూర్గ్‌ను అద్భుతమైన గమ్యస్థానంగా మార్చాయి. ఇది వీకెండ్ ట్రిప్ లకు.. ముఖ్యంగా బెంగళూరు లేదా మైసూరు నుంచి సులభంగా చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుది.
Day– 1: ప్రధాన ప్రాంతాలు:
రాజా సీట్ : సూర్యాస్తమయాన్ని చూడటానికి, లోయ అందాలు ఆస్వాదించడానికి ఉత్తమమైన ప్రదేశం.
అబ్బే జలపాతాలు : కాఫీ, సుగంధ ద్రవ్యాల తోటల గుండా నడుస్తూ ఈ శక్తివంతమైన జలపాతాన్ని చూడండి.
ఓంకారేశ్వర దేవాలయం: ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ఉన్న పురాతన శివాలయం సందర్శించండి
Day– 2: చిక్‌మగళూరుకు ప్రయాణం :
దుబారే ఏనుగుల శిబిరం : కావేరీ నది ఒడ్డున ఏనుగులకు స్నానం చేయించడం,వాటితో గడపడం వంటివి ఇక్కడ చేయవచ్చు.
మధ్యాహ్నం లేదా సాయంత్రం చిక్‌మగళూరుకు ప్రయాణించండి.
చిక్మగళూరు – కాఫీ భూమి (Day 2 & Day 3)
కర్ణాటకలో మొట్ట మొదటిసారిగా కాఫీని పండించిన ప్రాంతం. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, సాహస క్రీడలకు అవకాశం ఉంది.
Day– 2: ప్రధాన ఆకర్షణలు:
ముళ్ళయ్యనగిరి శిఖరం : కర్ణాటకలో ఎత్తైన శిఖరం. ఇక్కడికి డ్రైవింగ్ లేదా చిన్న ట్రెకింగ్ ద్వారా చేరుకోవచ్చు. సూర్యాస్తమయాన్ని చూడటానికి అనువైనది.
Day– 3: ప్రధాన ఆకర్షణలు:
బాబా బుడన్‌గిరి : ఇక్కడ హిందూ, ముస్లింలకు పవిత్రమైన గుహ, దత్తాత్రేయ పీఠం ఉన్నాయి.
హెబ్బె జలపాతాలు : దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ జలపాతాలు కచ్చితంగా చూడాల్సినవి.
2. వారసత్వం, రాజసం కోసం: మైసూరు – హంపి మార్గం:
చరిత్ర, సంస్కృతి , నిర్మాణ అద్భుతాలను ఇష్టపడే వారికి ఈ మార్గం ఉత్తమం.
మైసూరు – సాంస్కృతిక రాజధాని (Day 1)
అద్భుతమైన మైసూరు ప్యాలెస్, చాముండి కొండలు, అందమైన బృందావన్ గార్డెన్స్ ఇక్కడ చూడాలి.
Day– 1: ప్రధాన ఆకర్షణలు:
మైసూరు ప్యాలెస్ : భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన ప్యాలెస్‌లలో ఒకటి. రాత్రిపూట లైటింగ్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
చాముండి కొండలు: చాముండేశ్వరి ఆలయం, నగరం యొక్క అందమైన దృశ్యాలు.
బృందావన్ గార్డెన్స్ : సాయంత్రం మ్యూజికల్ ఫౌంటెన్ షో చూడటానికి అనువైనది.
హంపి – విజయనగర సామ్రాజ్యం శిథిలాలు (Day 2 & Day 3)
ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం. విజయనగర సామ్రాజ్యం యొక్క చరిత్ర, అద్భుతమైన శిల్పకళను ఇక్కడ చూడవచ్చు. (మైసూరు నుండి హంపికి ప్రయాణ సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి ఎక్కువ సమయం కేటాయించాలి లేదా అంతర్గత విమానాలు/రైళ్లు ఎంచుకోవాలి.
Day – 2: ప్రధాన ఆకర్షణలు:
విరూపాక్ష దేవాలయం: ఇప్పటికీ పూజలు అందుకుంటున్న ప్రధాన ఆలయం.
విఠల దేవాలయం ప్రసిద్ధ రాతి రథం, సంగీత స్తంభాలు ఇక్కడ ఉన్నాయి.
Day –3: ప్రధాన ఆకర్షణలు:
హజారా రామ మందిరం: రామాయణ ఇతిహాస దృశ్యాలను తెలిపే చెక్క కట్టడాలు.
లక్ష్మీ నరసింహ విగ్రహం: భారీ ఏకశిలా విగ్రహం.
హేమకూట కొండ : సూర్యాస్తమయాన్ని చూడటానికి ఇది అద్భుతమైన ప్రదేశం.