Vijay Varma: విజయ్ వర్మ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విజయ్ వర్మ(Vijay Varma) ప్రస్తుతం సినిమాలు సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈయన తమన్నా (Thamannaah) లవర్ గా కూడా అందరికీ ఎంతో సుపరిచితమే. విజయ్ వర్మ, తమన్నా ఇద్దరూ లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని వెల్లడించారు. ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట చట్టాపట్టాలేసుకొని ఎక్కడ చూసిన జంటగా కనిపించేవారు. ఇకపోతే ఇటీవల వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా విజయ్ వర్మ తమన్నా బ్రేకప్ గురించి ఎక్కడ అధికారకంగా వెల్లడించకపోయినా వీరిద్దరూ ఇటీవల కాలంలో ఎక్కడా కలిసి జంటగా కనిపించలేదు అదేవిధంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా డిలీట్ చేయటంతో బ్రేకప్ వార్తలు నిజమేనని స్పష్టం అవుతుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ వర్మ తన డిప్రెషన్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో తాను తన అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటూ పూర్తిగా డిప్రెషన్ కి గురి అయ్యానని తెలిపారు. మా అపార్ట్మెంట్ టెర్రస్ పై కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండేవాడిని లేదంటే నాకు పిచ్చి పట్టేదేమోనని తెలిపారు.
కెరియర్ పరంగా నిరంతరం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న నాకు ఒక్కసారిగా బ్రేక్ వచ్చిందని, ఒంటరి అనే ఫీలింగ్ నన్ను చుట్టూ ముట్టిందని, ఆ సమయంలో కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నానని తెలిపారు. ఇలా డిప్రెషన్ కారణంగా తాను పూర్తిగా పిచ్చోడ్ని అయిపోయాను అదే సమయంలో అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan)లేకపోతే మరింత పిచ్చోడ్ని అయ్యేవాడిని. నేను డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఐరా ఖాన్, గుల్షన్ దేవయ్య నాకు పూర్తిగా అండగా నిలిచారు.
ఐరా ఖాన్ వల్లే బయటపడ్డాను..
వీరిద్దరూ తరచూ నాతో ఫోన్ మాట్లాడటం వీడియో కాల్ చేస్తూ నన్ను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఒకే చోటే ఉండిపోకుండా కెరియర్లో ముందుకు వెళ్లాలని ఐరా ఖాన్ నన్ను ఎంతగానో ప్రోత్సహించిందని, తను కనుక ఆ సమయంలో నాకు మద్దతుగా నిలవకపోతే ఈపాటికి పిచ్చోడిగా మారిపోయే వాడిని అంటూ ఈయన తన డిప్రెషన్ గురించి అలాగే డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారనే విషయాలు గురించి కూడా తెలియజేశారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం యోగా, ధ్యానం చేయటం వంటి వాటి వల్ల తాను డిప్రెషన్ నుంచి క్రమక్రమంగా బయటపడ్డానని విజయ్ వర్మ తెలిపారు. ఇక విజయవర్మ కెరియర్ విషయానికి వస్తే త్వరలోనే ఈయన నటించిన గుస్తాక్ ఇష్క్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 28వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగానే విజయ్ వర్మ ఈ విషయాలను బయటపెట్టారు.
Also Read: Sandeep Reddy: సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ కన్ఫర్మ్..హింట్ ఇచ్చిన డైరెక్టర్?