BigTV English

Venuswamy Horoscope: అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం ఎలా ఉందో చూశారా ? వైవాహిక జీవితంలో ?

Venuswamy Horoscope: అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం ఎలా ఉందో చూశారా ? వైవాహిక జీవితంలో ?

Venuswamy Life Horoscope : వేణుస్వామి.. ఈయన పేరు చెప్పేటపుడు ప్రముఖ జ్యోతిష్యుడు అని కూడా చెప్పాల్సిన పనిలేదు. ఆ పేరు వింటే చాలు.. ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎంతోమంది ప్రముఖుల జీవిత జాతకాలను చెప్పి.. తరచూ విమర్శల పాలవుతున్నాడు. సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటున్నారంటే చాలు.. వాళ్లు విడిపోతారని అపశకునాలే తప్ప.. ఇంతవరకూ ఏ ఒక్క సెలబ్రిటీ జంట కలిసి ఉంటారని చెప్పిన పాపానపోలేదు. రాజకీయాల్లోనూ వేలు పెట్టి.. దారుణమైన ట్రోలింగులను ఎదుర్కొన్నాడాయన.


రష్మిక – రక్షిత్ శెట్టి ఎంగేజ్ మెంట్ తర్వాత వారిద్దరూ కలవరని చెప్పారు. ముఖ్యంగా నాగచైతన్య – సమంత వైవాహిక జీవితంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ తర్వాత ఆయన చెప్పినట్లే ఇద్దరూ విడిపోవడంతో.. వేణుస్వామి చెప్పిందే జరిగిందన్నవారు లేకపోలేదు. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని, ఇండస్ట్రీలో ప్రముఖ హీరో రోగంతో చనిపోతాడని, ఇక ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాలు చెప్పి అభాసుపాలయ్యారు.

తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో ఆయన చెప్పింది జరగకపోవడంతో ఇక జాతకాలు చెప్పడం మానేస్తానన్న వేణుస్వామి.. యూ టర్న్ తీసుకున్నారు. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్న చై- శో ల వైవాహిక జీవితంపై కామెంట్స్ చేసి.. మళ్లీ టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారారు. మరి అందరి జాతకాలు తనకే తెలుసంటున్న వేణుస్వామి జాతకం ఎలా ఉందో.. ఆస్ట్రాలజర్ నందిభట్ల శ్రీహరి శర్మ చెప్పిన వివరాల్లో చూద్దాం.


వేణుస్వామి జాతకం

వేణుస్వామి ధనుర్ లగ్నం, మిథునరాశిలో జన్మించారు. గురుడు లగ్నాధిపతి. ఆయన బలంగానే ఉన్నాడు. లాభంలో రాహువు, పంచమంలో కేతువు, షష్ఠమంలో కుజుడు వక్రీకరణలో, అష్టంలో శని వక్రీకరించి ఉన్నారు. అష్టమ స్థానంలో శని వక్రీకరణగా ఉండటంతో మంచి ఆయుష్షు ఉంటుంది.

ఇక 23 ఏప్రిల్ 2016 నుంచి 24 ఫిబ్రవరి 2023 వరకూ కేతు మహార్దశ జరిగింది. కేతువు పంచమ స్థానంలో ఉన్నా కుజుడు వక్రీకరించి ఉండటంతో శుభఫలితాలు వచ్చాయి. ఫలితంగా 2016 నుంచి 2022 వరకూ అన్నిరకాల భోగాలను వేణుస్వామి అనుభవించారని నందిభట్ల శ్రీహరి శర్మ వెల్లడించారు. పేరు ప్రఖ్యాతులు కలిగాయి.

24 ఫిబ్రవరి 2023 వేణుస్వామికి శుక్ర మహార్దశ ప్రారంభమైంది. ఇది 20 సంవత్సరాల పాటు ఉందని తెలిపారు. దీనివల్ల అవయోగం కలుగుతుంది. అందుకే గతేడాది నుంచి వేణుస్వామి విమర్శలు ఎదుర్కొంటున్నారని శ్రీహరి శర్మ తెలిపారు. ఈ 20 ఏళ్లపాటు ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే.. వేణుస్వామి జీవితం కాస్త బాగానే ఉంటుందని తెలిపారు. ఇలా సెలబ్రిటీల జీవితాల గురించి జోస్యాలు చెప్పడం మానివేస్తే మంచిదన్నారు.

వేణుస్వామి వైవాహిక జీవితం

ఎవరు పెళ్లిచేసుకున్నా విడిపోతారని చెప్పే వేణుస్వామి వైవాహిక జీవితం ఎలా ఉందో శ్రీహరిశర్మ వివరించారు. “ఏ మనిషి జాతకచక్రంలో అయినా ఏడవ స్థానం వివాహ స్థానం. వేణుస్వామి జాతకంలో వివాహ స్థానాధిపతి, యోగ కారకుడైన నవమాధిపతి రవి, బుధుడు ఇద్దరూ కలిసి కుటుంబ స్థానంలో ఉన్నారు. కుజుడు, శుక్రుడు పరస్పర వీక్షణలో ఉండటంతో లవ్ మ్యారేజ్ జరిగింది. శుక్రుడు భోగానికి, కామానికి ప్రతీక అయితే.. కుజుడు అతికామకత్వానికి ప్రతీక. శుక్ర, కుజులు ఎవరి జాతకంలో కలిసినా.. ఎవరి జాతకంలో పరస్పర వీక్షణలో ఉన్నా.. వారికి ద్వితీయ వివాహం జరగడం లేదా మనస్ఫర్థలు ఏర్పడుతాయి. వేణుస్వామి జాతకంలో శుక్ర, కుజులు పరస్పర వీక్షణలో ఉన్నారు కాబట్టి.. వారి వైవాహిక జీవితంలోనూ అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగానే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుని ఉంటారు.”

“పితృశాపం ఉంది. తండ్రి వైపు ఆరు తరాల్లో, తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణాలు కూడా జరిగి ఉండొచ్చు. శుక్రుడికి 12వ స్థాన స్థితి కలగడంతో కొంతవరకూ వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గుతాయి.”

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×