Big Stories

Old darwaja:- కొత్త ఇంటికి పాత గుమ్మాలను వాడొచ్చా…

Old darwaja:-ఏ గృహానికైనా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలు ఉండవు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.గడప చాలా ప్రాధాన్యత కలిగినది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా గృహం సింహద్వారానికి గడప నిర్మించుకోవాలి.

- Advertisement -

మనం ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్‌ అవుతున్నాం… అప్పుడు పాత ఇంట్లో ఉన్న సోఫాలని, బీరువాలని, డైనింగ్‌ టేబుల్‌ లాంటి వాటిని తీసుకుపోతాం. కొత్త ఇంట్లో కొత్త వస్తువుల్ని కొనుక్కుని జీవించాలనే నియమం ఎలాగైతే లేదో పాత ఇల్లు కూల్చినపుడు ఆ టేకు ద్వారాలని, కిటికీలని చెడిపోకుండా ఉన్నవాటిని… నాణ్యత కలిగిన వాటిని తీసుకుని కొత్త ఇంటికి నిర్మాణం చేసుకో వచ్చును. ఏ దోషమూ లేదు.

- Advertisement -

సూక్ష్మక్రిముల ద్వారా ఆయా కిటికీలు, ద్వారాలు రంధ్రాలుపడి లోపల బోలుగా మారి చెడి పోయివుంటాయి. అలాంటివాటిని ఎలాగో వదిలేయాల్సివస్తుంది. కాబట్టి అలాంటి చెక్కలు ఉంటే తీసిపారేసి కార్పెంటర్‌ సలహామేర కు వాటిని వాడుకోవచ్చు. కర్రవస్తువులు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాటిని కొత్త ఇంటి నిర్మాణానికి వాడుకోవచ్చు. పునాది రాళ్లను కూడా వాడుకోవచ్చు. దోషమనేది ఉన్నది అంటే ఆ గృహ నిర్మాణ పద్ధతులను బట్టి ఉంటుంది. ఈశాన్యం తెగిపోయినట్లుగానో… ఆగ్నేయంలో గొయ్యిని పెట్టో, నైరుతిలో ద్వారాలు పెట్టో రకరకాల నిర్మాణ శైలి ద్వారా ఆ గృహంలో అశుభాలు కలుగు తాయే తప్ప గృహానికి ఉపకరించే వస్తు సామాగ్రి, రాళ్లు వంటి సామాగ్రి ద్వారా జరగదు.

అలాగే నాణ్యమైన పాత గుమ్మాలు, తలుపుల ద్వారా ఏరకమైన అశుభం జరగదు. అయితే పాత ఇంటికి సంబంధించి ఇటుకలు మాత్రం పనికి రావు. కొంత మంది ఇళ్లు కూలగొట్టి… ఇటుకలను అన్నీ కలిపి పేర్చు కుంటుంటారు. ఆ ఇటుకలతో ఒక సవ్యమైన స్థితిలో గోడలు రావు. కాబట్టి పాత ఇంటి రాళ్లను, పాత ఇంటి కర్ర సామాగ్రిని, పాత ఇంటి చెడిపోని వస్తు సామాగ్రిని నూతన ఇంటి నిర్మాణానికి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అందులో ఎటువంటి దోషమూ లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News