Big Stories

Telangana: నేటి నుంచి కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌.. అందుబాటులో 5 లక్షల టీకాలు ..

Telangana: కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. తెలంగాణలో రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో సర్కారు అలర్ట్ అయింది. వెంటనే బూస్టర్ డోస్ ఇవ్వడం మొదలుపెడుతోంది. బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేపట్టింది.

- Advertisement -

అయితే, ఈసారి వ్యాక్సిన్ మారింది. గత రెండు డోసులు కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఇచ్చారు. బూస్టర్ డోసుగా ఇవి కాకుండా కొత్తగా ‘కార్బీవ్యాక్స్’ ఇస్తున్నారు. మొదటి రెండు రోజులు ఏ వ్యాక్సిన్ తీసుకున్న వారైనా.. బూస్టర్‌గా ‘కార్బీవ్యాక్స్’ తీసుకోవచ్చని.. ఎలాంటి ప్రమాదం ఉండదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.. హైదరాబాద్‌కి చెందిన ‘బయోలాజికల్‌-ఈ’ సంస్థ.

- Advertisement -

5 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉంచింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘కార్బీవ్యాక్స్’ అందుబాటులో ఉంచారు. అర్హులు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా తీసుకోవచ్చని డీహెచ్ తెలిపారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ల కొరతతో కొంతకాలంగా బూస్టర్‌ డోసుల పంపిణీ నిలిచిపోయింది. అటు, కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలే సొంతంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌లు కొనుగోలు చేయాలని ఇటీవల తేల్చి చెప్పింది. దీంతో.. తెలంగాణ సర్కారు హైదరాబాద్‌కి చెందిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ‘బయోలాజికల్‌ ఈ’ నుంచి 5 లక్షల ‘కార్బీవ్యాక్స్’ డోసులను కొనుగోలు చేసింది. బుధవారం నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News