BigTV English

Full Moon : పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రయాణం చేయద్దా…?

Full Moon : పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రయాణం చేయద్దా…?
Full Moon

Full Moon : నిత్యజీవితంలో ఎవరైనా సరే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు వివరించాయి.


నవమీ, పాడ్యముల్లో తూర్పు వైపునకు, విదియ, దశమి తిథుల్లో ఉత్తరం వైపుకు, తదియ, ఏకాదశుల్లో ఆగ్నేయానికి, అలాగే చవితి,ద్వాదశుల్లో నైరుతి వైపుకు, పూర్ణిమ, సప్తమి తిథుల్లో వాయువ్యానికీ, అమావాస్య అష్టమి రోజుల్లో ఈశాన్యానికీ ప్రయాణం చేయద్దని శాస్త్రం చెబుతోంది. అలా వెళ్లాల్సి వస్తే దైవ పూజ చేసుకుని వెళ్లమని శాస్త్రం చెబుతోంది.

మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది.


మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. శరీరంలో ఆటు పోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం.అందుకే,ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమ రోజు పనులు ఏవి కావు.

అలాగే అమావాస్య నాడు రాత్రి పూట వెలుతురు ఉండదు. తక్కువ వెలుతురులో ప్రయాణం ఆపదలకు స్వాగతం పలికినట్టే. చీకట్లో దొంగల భయం కూడా ఉండొచ్చు. అందుకే అమావాస్య నాడు అందులోను ఒంటరి ప్రయాణాలు వద్దని శాస్త్రం చెబుతోంది.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×