SKN Review on The Girl Friend Movie: రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. దసరా ఫేం దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. నటుడు దర్శకుడి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధంగా ఉంది. ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఇక సినిమా విడుదలకు ముందు ఇండస్ట్రీలోని వారికి కోసం మూవీ టీం ప్రీమియర్స్ వేసింది. ఇది చూసిన వారంత ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ముఖ్యంగా రష్మిక నటనను కొనియాడుతూ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్పామెన్స్ అంటూ రివ్యూ ఇస్తున్నారు. అంతేకాదు మూవీపై కూడా తమ రివ్యూ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు దర్శకులు మూవీ చూసి తమ రివ్యూని ఇచ్చారు. తాజాగా బేబీ మూవీ నిర్మాత ఎస్కేఎన్ (SKN) కూడా తన రివ్యూ ఇచ్చారు. “నిన్న రాత్రి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశా. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఆమె నటనకు నేషనల్ అవార్డు ఇవ్వోచ్చు. అలాగే దీక్షిత్ నటన కూడా చాలా బాగుంది. ఈ కథను ఎంచుకున్న డైరెక్టర్ రాహుల్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ప్రతి ఫ్రేం, ప్రతి సీన్, డైలాగ్ మలిచిన తీరు కథను నిజం చేశాయి. ప్రతి ఒక్కరు చూసి మాట్లాడుకోవాల్సిన చిత్రమిది. ఇలాంటి మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న మూవీ టీం నా శుభాకాంక్షలు” అంటూ ఎస్కేఎన్ రాసుకొచ్చాడు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ కథ, కథనం ఈ సినిమాకు ప్రధాన బలమని, ప్రియురాలిగా రష్మిక భూమ పాత్రకు ప్రాణం పోసిందంటున్నారు. థియేటర్ వచ్చిన ప్రతి ఆడియన్ నిజమైన కథ అనుభూతిని పొందుతారని అంటున్నారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా నెక్ట్స్ లెవెల్ అంటున్నారు. అలాగే దీక్షిత్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడన్నారు.
Also Read: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్ట్ ఫైర్
Watched #TheGirlfriend last night.
Absolutely loved it.National crush @iamRashmika garu has truly lived the role and delivered a National Award winning performance.@Dheekshiths was very good.@23_rahulr did a brilliant job in bringing this subject to life. Every frame, every…
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 6, 2025
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను తెరపైకి తీసుకు వచ్చిన దర్శకుడి (రాహుల్ రవీంద్రన్)ని అభినందించాలని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కాగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మొదట తెలుగుతో పాటు హిందీ భాషలో నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. ఇతర భాషల్లో మరో వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో నవంబర్ 14న రిలీజ్ కానుంది.