BigTV English
Advertisement

#NTR Neel: తారక్ పై నీల్ స్పెషల్ ఫోకస్.. మరీ ఇలా అయితే ఎలా గురూ!

#NTR Neel: తారక్ పై నీల్ స్పెషల్ ఫోకస్.. మరీ ఇలా అయితే ఎలా గురూ!

#NTR Neel: సాధారణంగా ఒక దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే తన విజన్ ఎలాంటిదో తెరపై కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఒక సినిమాను తెరకెక్కించడమే కాదు ఆ సినిమాలో నటీనటుల నటన.. వారి గెటప్ కూడా ముఖ్యమే అని.. ఇప్పుడు చాలామంది దర్శకులు నిరూపిస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తన సినిమాలోని హీరో గెటప్ పై తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇలా అయితే ఎలా గురూ అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ఎన్టీఆర్ 31 పై ఫోకస్ పెట్టిన ప్రశాంత్ నీల్..

ఉగ్రం, కేజీఎఫ్ 1&2, సలార్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో ‘ఎన్టీఆర్ 31’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్పుడు సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్ ఎప్పుడో పూర్తి చేశారు. కానీ మధ్యలో హీరోకి , డైరెక్టర్ కి మధ్య చిన్న క్లాష్ ఏర్పడడంతో ఇన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ గొడవలు తగ్గిపోయాయని.. షూటింగ్ ప్రారంభం కాబోతోంది అని మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే..మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ALSO READ:Actor Death: హీరో యష్ ఛాఛా మృతి.. దుఃఖంలో ఇండస్ట్రీ!


హీరో లుక్ పై మరింత జాగ్రత్త..

ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు అఫీషియల్ గా ఒక పోస్టర్ ను పంచుకున్నారు. అందులో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ను.. గడ్డం లుక్ ను ప్రశాంత్ నీల్ దగ్గరుండి మరీ స్టైల్ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లుక్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు అని కామెంట్లు చేయగా.. మరి కొంతమంది మరీ ఇలా అయితే ఎలా.. కాస్త హీరోకి కూడా ప్రైవసీ ఇవ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది దర్శకుడు తన పాత్రకు తగ్గట్టుగా హీరోని మేకోవర్ చేయిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ పోస్టర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ సినిమాలు..

ఉగ్రం సినిమాతో కెరీయర్ ను మొదలుపెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కే జి ఎఫ్ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించారు. అలాగే ప్రభాస్ తో సలార్ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం అందరి అంచనాలు ఈ సినిమా పైనే ఉన్నాయి. ఇటు ప్రశాంత్ కూడా చాలా పగడ్బందీగా.. జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related News

Anasuya Bharadwaj: తమిళ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్‌ రిలీజ్‌.. ప్రభుదేవతో రొమాన్స్‌!

Bahubali: The Epic Collections: బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

The Girlfriend Movie: ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ మూవీపై బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌ రివ్యూ.. ఏమన్నారంటే

Sandeep Reddy Vanga : నిర్మాతగా మారిన సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ హీరోగా కొత్త దర్శకుడు పరిచయం

Actor Death: హీరో యష్ ఛాఛా మృతి.. దుఃఖంలో ఇండస్ట్రీ!

SSMB 29 : మూడు నిమిషాల పాటు వీడియో రెడీ, కథను కూడా చెప్పేస్తారా?

Fauzi : ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ తో ప్రభాస్ ఫిదా, రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్

Big Stories

×