The Great Pre Wedding Show Movie Review : యంగ్ హీరో తిరువీర్… మసూద, పరేషాన్ లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ సపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీతో వస్తున్నాడు. మరి ఈ మూవీ తిరువీర్‌కి సక్సెస్ తీసుకొచ్చిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న పల్లెటూల్లో రమేష్ (తిరువీర్) ఫోటో స్టూడియో నడుపుతాడు. అదే గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తుంది హేమ (టీను శ్రావ్య). వీరి ఇద్దరి మధ్య మూగప్రేమ నడుస్తుంది. వీరి కథ ఇలా ఉండగా.. అదే గ్రామంలో మండలాధ్యక్షుడు దగ్గర పని చేస్తూ ఉంటాడు ఆనంద్ (నరేంద్ర రవి). ఇతనికి సౌందర్య (యామిని)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది.
ఈ నేపథ్యంలో తమ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని రమేష్ దగ్గరకు వస్తాడు ఆనంద్. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన తర్వాత.. ఫుటేజ్ ఉన్న చిప్ రమేష్ అసిస్టెంట్ (మాస్టర్ రోహన్) ఎక్కడో పడేస్తాడు. తన ప్రీ వెడ్డింగ్ వీడియో కోసం ఆనంద్ ఏం చేశాడు ? చిప్ పోయిన తర్వాత ఆనంద్ – సౌందర్యల పెళ్లి పై రమేష్ ఏం చేశాడు ? దీనికి పంచాయతీ సెక్రటరీ హేమ ఎలాంటి సాయం చేసింది ? ఫైనల్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వచ్చిందా ? లేదా అనేది సినిమాలో చూపించారు.
ఈ మలయాళ, తమిళ సినిమాలు బాగా ఆడుతాయి. దీనికి కారణం విలేజ్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో సాగే కథలు. అలాగే న్యాచురల్‌గా ఉండే యాక్టింగ్. వీటి వల్లే ఆ మలయాళ, తమిళ సినిమాలు మన తెలుగు వాళ్లను కూడా మెప్పిస్తున్నాయి. వీటిని చూసిన తర్వాత మన తెలుగులో కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పొచ్చు.
పక్కా విలేజ్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్. ఒక్క చిన్న పాయింట్‌ను తీసుకుని.. దాంతో కామెడీని పండిస్తూ… న్యాచురల్ యాక్టింగ్.. అంతే న్యాచురల్ స్క్రీన్ ప్లేతో సినిమాను అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్.
ఇటు సినిమాలో కామెడీని సరిగ్గా పెట్టడంతో పాటు… ఎమోషనల్ సీన్స్‌ను కూడా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. దాన్ని బాగా స్క్రీన్ పై చూపించాడు. స్క్రీన్ ప్లేతో పాటు నటీనటుల ఎంపికలో కూడా డైరెక్టర్ ఫ్యాషన్ కనిపిస్తుంది.
హీరో పాత్రలో చేసిన ఒక తిరువీర్ మాత్రమే కాదు… మాస్టర్ రోహన్, పెళ్లి కొడుకు ఆనంద్ పాత్రలో చేసిన నరేంద్ర రవి… పెళ్లి కూతురు సౌందర్య పాత్రలో చేసిన యామిని… వాళ్ల తల్లిదండ్రులు… అందరూ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీటి అన్నింటికి శ్రీకాకుళం యాస సరిగ్గా సెట్ అయింది.
డైరెక్టర్ స్క్రీప్ట్‌కు నటీనటులు ఎంత వరకు న్యాయం చేశారో… అంతే టెక్నికల్ విభాగం నుంచి కూడా న్యాయం జరిగింది. కెమెరా వర్క్.. మ్యూజిక్ అన్ని కూడా చాలా న్యాచురల్‌గా కనిపించాయి స్క్రీన్ పైన. నిర్మాత కూడా సినిమా కోసం పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదు. కావాల్సిన దానికి కావాల్సినంత, కొలత చూసి మరి పెట్టినట్టు ఉన్నారు నిర్మాతలు. తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
అయితే సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ ను సరిగ్గా డీల్ చేయలేదేమో అనిపిస్తుంది. హీరో తప్పు చేసినట్టు ఫీల్ అయ్యే టైంలో… దాన్ని ఎక్కువ సేపు ల్యాగ్ చేయకుండా… వేరే సీన్స్‌తో కవర్ చేయాల్సింది. అలాగే టీను శ్రావ్యను తిరువీర్ పెళ్లి చెడగొట్టడానికి, పెళ్లి వాళ్లను కలపడానికి చేసే కన్విన్స్ చేసే సీన్‌ను ఇంకాస్త బెటర్‌గా డిజైన్ చేయాల్సింది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
కథ & స్క్రీన్ ప్లే
సహజత్వానికి దగ్గర ఉండే కాన్సెప్ట్
మ్యూజిక్ & కెమెరా
హీరో – హీరోయిన్‌ల లవ్ స్టోరీ కొంత వరకు
ఎమోషన్స్‌ను ఇంకా బలంగా చూపించాల్సింది.
మొత్తంగా… న్యాచురల్‌గా ఉండే ప్రీ వెడ్డింగ్ షో ఇది