Suzuki Hayabusa 2025: వేగం అంటే హయబూసా, శక్తి అంటే హయబూసా, లెజెండరీ సూపర్‌బైక్‌లలో రాజుగా నిలిచిన పేరు హయబూసా. ఏళ్లుగా వేగానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ బైక్ ఇప్పుడు మరోసారి కొత్త రూపంలో వచ్చింది. సుజుకి సంస్థ తాజాగా 2025 హయబూసా మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈసారి రూపం మార్చకపోయినా, టెక్నాలజీ అప్‌డేట్‌లు, రైడింగ్ సేఫ్టీ, ఇంకా పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్‌తో కొత్త తరం బైక్‌లకు సవాల్ విసిరింది.
ఏరోడైనమిక్స్ డిజైన్
కొత్త హయబూసా బాడీ డిజైన్ చూస్తేనే ఏరోడైనమిక్స్‌కి ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది. ముందుభాగం షార్ప్‌గా, వెనుక భాగం స్ట్రీమ్‌లైన్‌డ్‌గా ఉండేలా తీర్చిదిద్దారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టెయిల్‌లైట్స్, సిగ్నల్ లైట్స్ అన్నీ కొత్త డిజైన్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మొత్తం బాడీ మీద కలర్ ఫినిషింగ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గ్లాస్ మ్యాట్ గ్రే, పర్ల్ విగర్ బ్లూ, మెటాలిక్ బ్లాక్ వంటి మూడు కొత్త కలర్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు.
1340 సీసీ ఇన్‌లైన్-ఫోర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్
ఇంజిన్ విషయానికి వస్తే, సుజుకి ఎప్పటిలాగే పవర్‌పై రాజీ పడలేదు. 1340 సీసీ ఇన్‌లైన్-ఫోర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్ వస్తుంది. ఇది 190 పిఎస్ పవర్, 150 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్ యూరో 5 ప్లస్ ఎమిషన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉండటంతో పాటు స్మూత్ పవర్ డెలివరీ ఇస్తుంది. గేర్‌బాక్స్ 6 స్పీడ్ మాన్యువల్, దానిలో క్విక్‌షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటితో హై స్పీడ్‌లో కూడా గేర్ మార్పులు సులభంగా చేయవచ్చు.
ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్
రైడింగ్ కంట్రోల్ విషయంలో సుజుకి పెద్ద మార్పులు చేసింది. ఇందులో సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (S.I.R.S) ఉంది. దీంట్లో పది రకాల ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్‌కు పది స్థాయిలు ఇవ్వడం వలన రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నా బైక్ బ్యాలెన్స్ కోల్పోదు. లాంచ్ కంట్రోల్ సిస్టమ్ రేస్ స్టార్టింగ్ టైమ్‌లో పవర్‌ను కంట్రోల్ చేస్తుంది. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి.
ట్రిప్ డేటా, పవర్ మోడ్ వివరాలు
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ కూడా క్లాసిక్ స్టైల్‌తోనే కొనసాగింది. రెండు పెద్ద అనలాగ్ డయల్స్ మధ్యలో చిన్న టిఎఫ్‌టి స్క్రీన్ ఉంచారు. దానిలో బైక్ సెట్టింగ్స్, ట్రిప్ డేటా, పవర్ మోడ్‌లు వంటి వివరాలు కనిపిస్తాయి. ఈ డిస్‌ప్లేలోనుంచే రైడర్‌కు కావలసిన ఎలక్ట్రానిక్ కంట్రోల్‌లను మార్చుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..
320ఎంఎం డ్యూయల్ ఫ్రంట్ డిస్క్
సస్పెన్షన్ సిస్టమ్ విషయానికి వస్తే ముందు భాగంలో కేవైబి ఇన్వర్టెడ్ ఫోర్క్స్, వెనుక భాగంలో ఫుల్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. వీటితో వేగంగా తిరుగుతున్నప్పుడు కూడా బైక్ సమతుల్యంగా ఉంటుంది. బ్రేకింగ్‌లో Bరెంబో స్టైలేమా కాలిపర్లు, 320ఎంఎం డ్యూయల్ ఫ్రంట్ డిస్క్‌లు ఇచ్చారు. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బైక్‌ను పూర్తిగా కంట్రోల్‌లో ఉంచుతాయి.
రైడర్ కంఫర్ట్
బైక్ బాడీ బరువు 264 కిలోలు అయినప్పటికీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీని తక్కువగా ఉంచడం వలన హ్యాండ్లింగ్ అద్భుతంగా ఉంటుంది. రైడర్ కంఫర్ట్‌పై కూడా ఈసారి ఎక్కువ శ్రద్ధ పెట్టారు. సీటు పొజిషన్ కొంచెం స్ట్రైట్‌గా ఉంచడంతో దీర్ఘకాల రైడ్‌లోనూ సౌకర్యంగా ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్స్, హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వలన ఇంజిన్ వేడి రైడర్‌కి అసౌకర్యం కలిగించదు.
చార్జింగ్ పోర్ట్ – స్మార్ట్ కీ సిస్టమ్
బైక్‌లో యూఎస్‌బి టైప్-సి చార్జింగ్ పోర్ట్, స్మార్ట్ కీ సిస్టమ్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, ఇంకా సుజుకి యొక్క సేఫ్టీ సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ ఉన్నాయి. ఇవన్నీ ఈ బైక్‌ను సూపర్‌బైక్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. కొత్త హయబూసా కేవలం వేగానికి కాదు, టెక్నాలజీకి కూడా గుర్తుగా నిలుస్తుంది. బైక్ ఆరంభించగానే వచ్చే ఇంజిన్ సౌండ్, గేర్ షిఫ్ట్‌కి వచ్చే స్పందన, వేగం పెరుగుతున్నప్పుడు వచ్చే స్టేబిలిటీ – ఇవన్నీ కలిపి హయబూసా అంటే ఎందుకు లెజెండ్ అని గుర్తుచేస్తాయి.
ఇండియాలో ధర ఎంతంటే?
ధర విషయానికి వస్తే, 2025 హయబూసా ధర 19,599 డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 16 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఇది ప్రస్తుతం అమెరికా, యూరప్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. హయబూసా అభిమానుల కోసం ఇది మళ్లీ వేగానికి కొత్త నిర్వచనం చెప్పే సమయం.