BigTV English
Advertisement

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

కూటమి విషయంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. కూటమి ఏర్పాటుపై విజయ్ దే నిర్ణయాధికారం అంటూ ఇటీవల పార్టీ ఓ తీర్మానం ఆమోదించింది. అదే సమయంలో ఆయనే తమ సీఎం అభ్యర్థి అని కూడా ప్రకటించింది. ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ఏపీలో పవన్ లా తమిళనాట విజయ్ కూడా ధైర్యం చేసి ఏదో ఒక కూటమిలో చేరితేనే భవిష్యత్ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. లేకపోతే బహుముఖ పోరులో సీట్ల సంగతి మర్చిపోయి ఓట్లు లెక్కేసుకోవాల్సిందేనని అంటున్నారు.


విజయ్ కాన్ఫిడెన్స్..
తమిళనాడులో డీఎంకే అధికార పార్టీ, అన్నా డీఎంకే ప్రతిపక్షం. కానీ ఈసారి ఆ లెక్కలు తారుమారవుతాయని అంటున్నారు టీవీకే అధ్యక్షుడు విజయ్. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటుందని చెప్పారు. ఒకటి డీఎంకే అని, రెండోది తమిళ వెట్రి కళగం(టీవీకే) అని చెప్పారు. విజయ్ కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాల్సిందే. అయితే అన్నా డీఎంకేలో నాయకుడు లేనంత మాత్రాన ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ని తక్కువ అంచనా వేయలేం. 2021లో జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే 66 స్థానాల్లో గెలిచింది. 2026 నాటికి పరిస్థితుల్లో కచ్చితంగా మార్పులు వస్తాయనే అంచనా ఉంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో లుకలుకలు ఉన్నా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం వారివైపే ఉంటుందని తెలుస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

తమిళ సెంటిమెంట్..
గతంలో తమిళనాట అధికార పార్టీ ఓడిపోవడం ఖాయమనే సెంటిమెంట్ ఉండేది. కానీ ఆ మధ్య అన్నాడీఎంకే వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి రావడంతో స్టాలిన్ సీఎం అయ్యారు. ఇప్పుడు సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, లేదా అన్నా డీఎంకేకి రెండుసార్లు ఛాన్సిచ్చిన తమిళ ప్రజలు ఈసారి కూడా స్టాలిన్ కే పట్టం కడతారా అనేది వేచి చూడాలి.


Also Read: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Also Read: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా..

విజయ్ సంగతేంటి?
రజనీకాంత్ వంటి మహామహులే తమిళనాడులో రాజకీయాలు చేయలేక చేతులెత్తేశారు. విజయ్ కాంత్, కమల్ హాసన్ కూడా కష్టానికి తగ్గ ఫలితం సాధించలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఎంట్రీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టి, ఎవరితోనూ పొత్తు పెట్టుకోను, ఒంటరిగా బరిలో దిగుతానంటున్నారు. ఎన్నికల ముందు డీఎంకేని, అదే స్థాయిలో అన్నా డీఎంకేని విమర్శిస్తున్న విజయ్, రేపు ఫలితాలు వచ్చిన తర్వాత పొత్తులకు వెళ్లాలంటే కష్టమే. అందుకే ఇప్పుడే ఏదో ఒకటి డిసైడ్ కావాలని సూచిస్తున్నారు విజయ్ సన్నిహితులు. ఏపీలో పవన్ కల్యాణ్ ఉదాహరణ చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ సింగిల్ గా పోటీ చేసి ఇబ్బందులు పడి, ఆ తర్వాత పొత్తుతో ఏకంగా డిప్యూటీసీఎం అయ్యారు. తమిళనాడు పరిస్థితి కూడా అలాగే ఉంది. టీవీకే సోలోగా పోటీ చేస్తే, బహుముఖ పోరులో అధికార డీఎంకేకి లాభం జరిగే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు. పొత్తు పెట్టుకుని బరిలో దిగితే, కచ్చితంగా జాక్ పాట్ కొట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికి విజయ్ ఆలోచన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Also Read: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×