Sandeep Reddy Vanga : రీసెంట్ టైమ్స్ లో చాలామంది దర్శకులు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డివంగా మొదటి సినిమాతోనే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించి, తెలుగువాడు సత్తా ఏంటో మరోసారి తెలిసేలా చేశాడు. అయితే కబీర్ సింగ్ సినిమాని చాలామంది బాలీవుడ్ ప్రముఖ జర్నలిస్టులు వైలెంట్ ఫిలిం అని కామెంట్ చేశారు. అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో మీకు చూపిస్తాను అని ఛాలెంజ్ చేసి మరి అనిమల్ సినిమా చేశాడు.
యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2026 లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ భారీ అంచనాలను పెంచింది. ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
కేడి సినిమాకు పని చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకుడుగా సినిమా ప్రయత్నాలు చేశారు. తరుణంలో చాలామంది నిర్మాతలకు కథను చెప్పారు. ఒక తరుణంలో వైజయంతి మూవీస్ స్వప్న అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ అది జరగలేదు.
మొత్తానికి సందీప్ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించటంతో అంతా సేఫ్ జోన్ కి వచ్చేసారు. అయితే ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ పేరు ప్రొడ్యూసర్ గా పడలేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా సినిమా చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ మందిలో సుమంత్ ప్రభాస్ ఒకడు. థియేటర్ బయట రివ్యూ చెప్పడం, కొన్ని ప్రాంక్ వీడియోలు చేయడం, అలానే కవర్ సాంగ్స్ చేయడంతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు సుమంత్ ప్రభాస్. దర్శకుడుగా కూడా మేము ఫేమస్ అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం గోదారి గట్టు పైన అనే సినిమా కూడా చేస్తున్నాడు.
సందీప్ రెడ్డి వంగ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో కొత్త దర్శకుడును పరిచయం చేస్తున్నారు. సుమంత్ ప్రభాస్ తో సినిమా చేయబోయే ఆ దర్శకుడు గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read: Singer Chinmayi : భావోద్వేగంలో బూతులు మాట్లాడిన చిన్మయి, ట్రోల్ చేస్తున్న మరో బ్యాచ్