Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తాళ్లగూడెం పోలీస్టేషన్ పరిధిలోని అన్నారం- మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం భీకర ఎదుర కాల్పులు సాగుతున్నాయి. మరోవైపు బుధవారం ఇక్కడ జరిగిన వియం తెలిసిందే.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పరిధిలోని తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు భారీ కంబింగ్ ఆపరేషన్ చేపట్టగా, మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో దాక్కున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ బలగాలు కలిసి ఆపరేషన్ ప్రారంభించాయి. గురువారం తెల్లవారుజామున బలగాలు అడవిలోకి చేరుకునే సరికి మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు.
దీంతో భద్రతా బలగాలు ప్రతిగా కాల్పులు జరపగా, ఇరు వర్గాల మధ్య సుమారు రెండు గంటల పాటు ఫైరింగ్ కొనసాగింది. చివరికి మావోయిస్టులు వెనక్కి తగ్గగా, సంఘటనా స్థలాన్ని తనిఖీ చేసిన భద్రతా బలగాలు నలుగురు మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
మృతులలో ఇద్దరు మద్దేడు ఏరియా కమిటీకి చెందిన కీలక నాయకులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరి గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను సంఘటనా స్థలం నుండి తరలించి పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
ఈ ఘటన అనంతరం సమీప ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు దాగి ఉన్నారనే అనుమానంతో.. భద్రతా బలగాలు చుట్టుముట్టి కంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిన వెంటనే బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ప్రాంతంలో ఇంకా కొందరు ఉండే అవకాశం ఉన్నందున ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు.
Also Read: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి
తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో స్థానిక గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. అడవుల సరిహద్దులో నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా బలగాలు వారికి భరోసా కల్పిస్తూ, ఇంట్లోనే ఉండాలని సూచనలు జారీ చేశాయి.