Chandra Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు మిథునరాశిలో కేవలం 2 రోజులు మాత్రమే ఉండబోతున్నాడు. దీని తరువాత.. చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి వరుసగా రెండు సంచారాల కారణంగా.. అనేక రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి.
మే నెల నేటి నుండి ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల చాలా ముఖ్యమైనది కానుంది. ఈ నెలలో.. అనేక ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. ఇది మొత్తం రాశులను ప్రభావితం చేస్తుంది. మే మొదటి తేదీ అంటే గురువారం రోజున వైశాఖ మాసం శుక్ల పక్ష చతుర్థి నాడు, చంద్రుడు తన రాశిని మారుస్తాడు. చంద్రుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.
చంద్రుడు మిథునరాశిలో 2 రోజులు మాత్రమే ఉంటాడు. దీని తరువాత.. కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి వరుస సంచారాల కారణంగా.. అనేక రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా 3 రాశుల వారికి అద్బుత ప్రయోజనాలు అందుతాయి. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి చంద్రుడి రాశి మార్పు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఈ వ్యక్తుల జాతకంలో బృహస్పతి ఇప్పటికే ఉన్నాడు. దేవగురువు బృహస్పతి ఇక్కడి నుండి బయలుదేరుతారు. ఫలితంగా చంద్రుని ప్రభావం పెరుగుతుంది. దీని కారణంగా..మీ ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో పాటు.. ఆఫీసుల్లొ చెడిపోయిన పని కూడా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. మీ ఇంటికి అతిథుల రాక మీకు సేవ చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రను కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయంలో శివుడిని, పార్వతి దేవిని పూజించండి. మతపరమైన కార్యక్రమాల్లో మీరు పాల్లొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ఉన్నతాధికారులు మీ పనిని కూడా ప్రశంసిస్తారు . పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం. మీరు ఆర్థిక పరంగా లాభాలు పొందేందుకు ఇది చాలా మంచి సమయం.
Also Read: మే నెలలో వీరికి ధనలాభం, 4 రాశుల వారికి మాత్రం కష్టాలు తప్పవు
సింహ రాశి:
చంద్రుడి రాశి మార్పు కారణంగా.. సింహ రాశి వారి జీవితాల్లో అపూర్వమైన మార్పులు కనిపిస్తాయి. ఈ వ్యక్తులు తమ కెరీర్‌లో ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించబడతాయి. అంతే కాకుండా చంద్రుడు సంచార సమయంలో కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఇది ఉత్తమ సమయం అవుతుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. అంతే కాకుండా మీ ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు విజయ ద్వారాలు తెరుచుకుంటాయి. మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. పెండింగ్ పనులు కూడా చాలా త్వరగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక కారణాల వల్ల పోయిన ప్రాజెక్టులు మీకు తిరిగి లభిస్తాయి. అంతే కాకుండా మీ ఆరోగ్యం కూడా మునుపటి కంటే చాలా మెరుగ్గా కూడా ఉంటుంది.