Rajinikanth : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామంది తెలుగు ప్రేక్షకులకు కూడా రజనీకాంత్ ఒక అభిమాన హీరో. ఇప్పటికే రజనీకాంత్ స్టైల్,స్వాగ్ ను ఎవరు మ్యాచ్ చేయలేరు అనేది వాస్తవం. కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చాలామందికి ఆదర్శంగా ఉంటారు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలి సినిమాతో పాటు, నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమాను కూడా చేస్తున్నారు. జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 400 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది.
సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి
రజనీకాంత్ భార్య లత నిర్వహించిన ఒక ఈవెంట్ కు హాజరయ్యాడు రజనీకాంత్. ఈవెంట్లో యువత గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మొబైల్ యుగంలో యువతకు, కొంతమంది పెద్దలకు మన దేశ సంప్రదాయాల గురించి తెలియడం లేదు. వారంతా భారతదేశ గొప్పదనం, వైభవం గురించి తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. విదేశీయులు వారి సంప్రదాయాల్లో ఆనందం, శాంతిని కనుగొనలేకపోవడం వల్లే మనదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ధ్యానం, యోగా ద్వారా ఆనందాన్ని తెలుసుకున్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకు లత ఒక గొప్ప ప్రయత్నం మొదలు పెట్టింది. దేవుడి దయతో ఆ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా అని మాట్లాడారు ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్
నగరం సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కార్తి హీరోగా చేసిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడితో లోకేష్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆల్మోస్ట్ కమల్ హాసన్ పని అయిపోయింది అనుకునే తరుణంలో విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కమల్ హాసన్ కం బ్యాక్ ఇవ్వడానికి ఉపయోగపడ్డాడు. కమల్ హాసన్ కి ఆ స్థాయి హిట్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు రజినీకాంత్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. అలానే జైలర్ సినిమా పైన ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. రజనీకాంత్ లోని ఎటువంటి అంశాలను ప్రేక్షకులు ఇష్టపడతారో వాటన్నిటిని జైలర్లో చూపించాడు నెల్సన్. ఇప్పుడు జైలర్ 2 సినిమాతో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లబోతున్నాడు.