Big Stories

Endala Mallikarjun Swamy Temple : శివ లింగాన్ని తాకిన గాలి పీల్చారా…?

- Advertisement -

Endala Mallikarjun Swamy Temple : సృష్టిలో మహిళగల శివాలయాలకి కొదవలేదు. మన దేశంలో ప్రాచీనమైనశివాలయాలు ఎన్ని ఉన్నా ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం మాత్రం ప్రత్యేకమైనది. మిగిలిన లింగాల మాదిరి ఎప్పుడూ ఒకేలా కనిపించదు. కాలం మారే కొద్దీ శివలింగం పురాతనంగా మారడం సహజం కాదు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎండల మల్లిఖార్జున స్వామి మాత్రం ప్రతీ సంవత్సరం క్రమంగా క్రమంగా పెరుగుతూనే ఉన్నాడు. బియ్యం గింజ పరిమాణంలో ఉన్న ఆలయం శివలింగం ఇప్పుడు ఊహించని ఎత్తుకి ఎదిగింది. సీతారామచంద్ర స్వామి చేతులుగా మీదగా ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్న మాట.

- Advertisement -

మిగిలిన ఆలయాలు మాదరిగా గోపురం, అద్భుతమైన శిల్ప సంపదనతో ఈగుడి నిర్మించలేదు. కారణం ఈ లింగం నిత్యం పెరగడమే . ఒడిశా రాజులు పరమశ్వేరుడికి ఆలయం నిర్మించాలని భావించినా సాధ్యపడలేదు. లింగం పరిణామం పెరుగుతుండటంతో స్వామికి ఆలయం సాధ్య పడలేదు. దీంతో ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూనే స్వామి వారు భక్తులకి దర్శనమిస్తుంటారు. ఆ రకంగా ఎండల మల్లిఖార్జున స్వామినిగా భక్తుల మనస్సుల్లో స్థిరపడ్డారు. స్వామి వారిని తాకిని గాలిని పీల్చితే చాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని శివభక్తులు విశ్వసిస్తుంటారు.

రోజుకి రోజుకి మల్లిఖార్జున స్వామి విగ్రహం పెరగడం అంతు చిక్కని రహస్యంగా మిగిలే ఉంది. రావివలసలోని ఈ మహిమానిత్వమైన ఆలయం చూసేందుకు సాధారణంగానే కనిపిస్తుంది. ఎండల మల్లిఖార్జున స్వామిని భక్తితో కొలిచిన వారికి పుత్ర భాగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. స్వామి దయతో అలా సంతానం కలిగిన వారికి శివయ్య పేరునే పెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎండలోనే భక్తులకి దర్శనమిచ్చే శివయ్యని చూసేందుకు చుట్టుపక్కల నుంచితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తుల ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News