BigTV English

Fairy Worship : యక్షిణి ఆరాధన అంటే…

Fairy Worship : యక్షిణి ఆరాధన అంటే…


Fairy Worship : దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తెలుగు రాష్ట్రాలకి కొన్ని విషయాల్లో తేడాలు గమనించవచ్చు. ఆలయ నిర్మాణ శైలిలోనే కాదు పూజలు, ఆచారాలకి వచ్చేటప్పటికి భిన్నంగా ఉంటాయి . పండుగల విషయంలోను పేర్లు కూడా వేరుగా ఉంటాయి. తెలుగు నేలపై పూజలను అన్నీ ఆగమ శాస్త్ర పద్దతుల్లో జరుగుతుంటాయి. తరతరాలుగా ఈ విధానాని పాటిస్తున్నారు. కేరళలో మాత్రం తాంత్రిక విధానంలో పూజలు చేస్తుంటారు. అక్కడ శబరిమల పూజారిని కూడా తంత్రి అనే సంబోధిస్తారు.

పురాణాలు, పౌరాణిక విషయాలకి వస్తే ఎవరి ఊహలు వారివి. ఇక్కడ యక్షులను మరుగుజ్జులుగా ఊహించుకుంటే కేరళలో యక్షులను సౌందర్య రూపాలుగా తలిచారు. గుడి చుట్టూ ఉండే గ్రహాల్లో ఒక గ్రహం యక్షిణిగా అంటారు. ఒక ఉపదేవత కావడం వల్ల యక్షిణి పూజతో మంచి జరుగుతుందని భావిస్తుటారు. మలయాళీల జానపదాల్లో యక్షిణులు యక్షజాతి నుంచి బహిష్కరింప బడినవారుగా భావిస్తారు. వారు భూలోకంలో మానవులతో కలిసి కోరికలు తీర్చుకుంటాని వారి జానపదాలు చెబుతున్నాయి. ఇలాంటి యక్షిణిలను తాంత్రిక విధానంలో అవాహన చేసి బంధించి ఆరాధిస్తే మేలు జరుగుతుందని వారి నమ్మకం.


భూలోకంలో యక్షిణులు రాత్రి పూట మాత్రమే సంచరిస్తారట. బాటసారులను ఆకర్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారట. రూపంలో విశాల నేత్రాలు, నల్లటి కురులు, శ్వేత వస్త్రాలతో మనోహరంగా ఉంటారు. ఇలాంటి యక్షిణులను తాంత్రికులు ప్రతిమగా మార్చేసి ఆలయాలను నిర్మించారు. యక్షిణిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. నిరంతమైన శక్తి కూడా వస్తుంది. అద్భుతమైన శక్తులు కూడా వస్తాయని విశ్వాసం కేరళ ప్రజల్లో ఉంది. . ఇలాంటి వారికి కట్టిన గుడులు అరణ్యంలోను, పెద్ద వృక్షాల కింద, నీటి మడుగులోను ఉంటాయని ప్రచారం.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×