Petrol Diesel Prices: హైదరాబాద్ లో పెట్రోల్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పది రోజుల నుంచి పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ధరల్లో మార్పు లేదంటే.. టాక్స్ విధానాలు, అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలు, అలాగే ఇతర కంపెనీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉద్యోగాలు ఎక్కువగా పెట్రోల్ పై ఆధారపడుతారు. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటుచేసుకోకపోవడం భాగ్యనగరవాసులకు, రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు శుభవార్తే అని చెప్పవచ్చు.
⦿ చమురు ధరలను ప్రభావితం చేసే అంశాలు ఇవే..
2017 జూన్ 16 నుంచి డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానం కొనసాగుతోంది. ఈ విధానం ప్రకారం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్ రేట్లు తెలియజేస్తారు. పెట్రోల్ ధరలను వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపీ డాలర్ మారకం రేటు, రాష్ట్ర విక్రియ పన్ను (వ్యాట్), సెంట్రల ఎక్సైజ్ సుంఖం, రిఫైనింగ్ ఖర్చులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాజిస్టిక్స్ ఖర్చులు కూడా చమురు ధరలను ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయంగా, చమురు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అస్థిరత, డిమాండ్-సప్లై సమతుల్యత, OPEC వంటి సంస్థల నిర్ణయాలు కూడా పెట్రోల్, డిజిల్ రేట్లను మార్పుకు కారణం అవుతాయి. ప్రస్తుతం, గ్లోబల్ చమురు మార్కెట్ స్థిరంగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో చమురు ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.107.46 వద్ద గత పది రోజులు స్థిరంగా కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.97.18గా ఉంది.
⦿ పెట్రోల్, డీజిల్ ధరలు సులభంగా…
డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానం ద్వారా.. హైదరాబాద్ లో ప్రతి రోజులు చమురు ధరలను ప్రకటిస్తున్నారు. గతంలో అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల్లో మార్పు గురించి తెలియజేసేవారు. భాగ్యనగర వాసులు చమురు ధరల గురించి తెలుసుకోవడానికి IOCL-‘Fuel@IOC’, BPCL -SmartDrive’, లేదా HPCL-‘MY HPCL’ వంటి మొబైల్ యాప్‌లను ఉపయోగించవచ్చు. అలాగే, SMS సేవలు లేదా ఆయిల్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ధరల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
⦿ ఇది నగరవాసులకు గుడ్ న్యూస్…
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో పెట్రోల్ ధరలు రూ.107.46 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో మార్పు పెద్దగా లేకపోవడంతో నగరవాసులకు ఆర్థికంగా ప్లాన్ చేయడంలో ఇది తోడ్పడుతోంది. అయితే, గ్లోబల్ చమురు ధరలలో ఏదైనా ఆకస్మిక మార్పు లేదా రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ పన్ను విధానాలలో మార్పులు జరిగితే.. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ రేట్లలో పెరుగుదల లేదా తగ్గుదల జరిగే అవకాశం ఉంటుంది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ లో కూడా హైదరాబాద్ లో పెట్రోల్ ధరలను ఈజీగా తెలుసుకోవచ్చు.
⦿ పెట్రోల్ రేట్లు..
➼ హైదరాబాద్: రూ.107.46
➼ విజయవాడ: రూ.109.56
➼ ఢిల్లీ: రూ.94.77
⦿ డీజిల్ రేట్లు..
➼ హైదరాబాద్: రూ.97.18
➼ విజయవాడ: రూ.95.70
➼ ఢిల్లీ: రూ.87.67