OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలను ఇండియన్స్ కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమాలను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. రీసెంట్ గా థియేటర్లలో రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఒక సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మంచి ఆదరణ పొందింది. ఈ కథ అడవి మంటల్లో చిక్కుకున్న ఒక స్కూల్ బస్ చుట్టూ తిరుగుతుంది. అందులో ఉండే స్కూల్ పిల్లలు, బయట పడటానికి చేసే ప్రయత్నాలు ఊపిరి పీల్చుకోకుండా చేస్తాయి. ఈ సినిమా ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది లాస్ట్ బస్’ (The Lost Bus) 2025లో వచ్చిన అమెరికన్ సర్వైవల్ సినిమా. దీనికి పాల్ గ్రీన్‌గ్రాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 19న థియేటర్స్‌లో విడుదలైంది. 2025 అక్టోబర్ 3 నుంచి Apple TV+లో స్ట్రీమింగ్ కి రాబోతోంది. 2 గంటల 9 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది.
పారడైస్ అనే చిన్న టౌన్‌లో జెస్సీ అనే వ్యక్తి స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఎల్లెన్ స్కూల్ టీచర్ గా పిల్లలను బాగా చూసుకుంటుంది. ఒక రోజు వాళ్ళు 22 మంది చిన్న పిల్లలను బస్‌లో స్కూల్ ట్రిప్ నుంచి తిరిగి తీసుకొస్తుంటారు. సడన్‌గా దారి మధ్యలో ఉండగా, వాళ్ళు ఉన్న అడవి చుట్టూ మంటలు స్టార్ట్ అవుతాయి. జెస్సీ, ఎల్లెన్ పిల్లలతో బస్‌లో ఎస్కేప్ అవ్వడానికి బయలుదేరతారు. కానీ మంటలు చుట్టుముట్టి, రోడ్లు బ్లాక్ అవుతాయి. ఇప్పుడు అందరిలో టెన్షన్‌తో స్టార్ట్ అవుతుంది.
ఆ ప్రాంతమంతా మంటలతో నిండిపోతుంది. జెస్సీ రోడ్ చేంజ్ చేసి, సేఫ్ ప్లేస్‌కి వెళ్లడానికి ట్రై చేస్తాడు. కానీ ఫ్యూయల్ కూడా తక్కువగా ఉంటుంది. చుట్టూ స్మోక్, ఫైర్ ఉండటంతో పిల్లలు భయపడుతుంటారు. ఎల్లెన్ స్టోరీలు చెప్పి, సాంగ్స్ పాడి పిల్లలను భయపడకుండా డైవర్ట్ చేస్తుంటుంది. జెస్సీ రేడియో ద్వారా ఫైర్ ఫైటర్స్ తో కాంటాక్ట్ ట్రై చేస్తాడు. కానీ సిగ్నల్ బీజీగా ఉంటుంది. ఈ సమయంలో ఒక పిల్లవాడు అస్తమా ప్రాబ్లమ్‌తో బాధపడతాడు. ఎల్లెన్ అతన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది.
ఇంతలో బస్ ఒక డెడ్ ఎండ్‌లో చిక్కుకుంటుంది. మంటలు మరింత క్లోజ్ అవుతాయి. వీళ్ళు పిల్లలను తీసుకుని వాక్ చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా డేంజరస్ గా ఉంటుంది. స్మోక్ వల్ల పిల్లలకు బ్రీత్ చేయడం కష్టంగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా అలసిపోతారు. ఎల్లెన్ పిల్లలను ఎంకరేజ్ చేస్తూ, గ్రూప్‌గా కలిసి నడవమంటుంది. ఫైర్ ఫైటర్స్ రేడియోలో సహాయం పంపుతామని చెప్పినా, టైమ్ తక్కువగా ఉంటుంది. ఇక జెస్సీ పిల్లలను సేవ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. చివరికి జెస్సీ, ఎల్లెన్ పిల్లలను కాపాడతారా ? మంటల్లోనే చిక్కుకుంటారా ? ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుంటారా ? అనే విషయాలను, ఈ సర్వైవల్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్