E-Paper
Advertisement

3 Desires to Ask God : దేవుడ్ని కోరాల్సిన 3 కోరికలు

3 Desires to Ask God : దేవుడ్ని కోరాల్సిన 3 కోరికలు
Advertisement

3 Desires to Ask God : ప్రతీ మనిషికి ఎన్నో కోరికలు పుడుతుంటాయి. ఒక కోరిక తీరగానే మరోటి పుడుతుంది. ఒకరికి ఇల్లు కట్టుకోవాలని, మరోకరికి కోట్ల కొద్దీ డబ్బులు కావాలని, ఇంకొకరు ఇల్లంతా బంగారం కావాలని ఇలా అంతులేని కోరికలతో తపిస్తూ ఉంటారు. అయితే దేవుడ్ని నమ్మితే కోరాల్సిన కోరికలు అవి కావంటారు.

Advertisement

చావు అనేది ఎవరిని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో తెలియదు. ఈరోజుల్లో పుట్టుకను కూడా ముహూర్తాలు నిర్ణయించే పరిస్థితి ఉంది. కానీ చావును ఇంకా మనిషి జయించ లేదు. జయించలేడు. అందుకే దేవుడ్ని కోరే కోరే మొదటి కోరిక ముగింపు సుఖంగా జరగాలనే కోరుకోవాలి. ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక పరిస్థితులు మన కంట్రోల్ లో ఉండవు. ఆ సమయంలో ఏదైనా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవత్ స్మరణతో అనాయాసంగా శరీరాన్ని విడవడం ఒక వరంగానే చెప్పాలి..

ఇక రెండో కోరిక విషయానికి వస్తే జీవితం ఎలా గడపాలి.. బతుకు భారంగా లేకుండా ఉండాలి. చీకు చింత, బెంగ, రోగాలు, జబ్బులు లేకుండా మనసును మెలిదీసి కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే కోరుకోవాలి. ఆరోగ్యంగానే ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. రోగాలతో బాధపడుతూ రోజులు వెళ్లదీయడం నరకమే..

Advertisement

ఇక మూడో కోరిక. మనిషి అంతిమలక్ష్యం ,జీవితానికి చివరి గమ్యం చావు కాదు. మృత్యువు తరువాత బతికి ఉన్నప్పుడు చేసిన దుష్కర్మలకు ఫలితాలు అనుభవించక తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మజన్మలు ఎత్తకుండా మోక్షం కలగాలని కోరుకోవాలి. పరమాత్ముడిలో ఐక్యం కావాలని దేవుడ్ని ప్రార్థించాలి.

జీవితాన్ని నడిపించే ఈ మూడు కోరికలు తీరాలంటే ముందు మంచి ఆలోచనలతో బుద్ధులతో భక్తితో మెలగాలి. అలాంటి జీవితమే దైన్యరహితం అవుతుంది. నిరంతరం భక్తితో దేవుడ్ని స్మరించేవారికి , ఆరాధన చేస్తేనే ఫలితం కలుగుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×