OTT Movie : పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అది కూడా రొమాంటిక్ జానర్ లో, ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. ఈ కథ లాహోర్‌లోని ఒక సాంప్రదాయ పంజాబీ కుటుంబ నేపథ్యంలో నడుస్తుంది. ఒక పెళ్ళైన వ్యక్తి ట్రాన్స్‌జెండర్ ప్రేమలో పడటంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా 95వ ఆస్కార్‌లకు పాకిస్తాన్ ఎంట్రీగా షార్ట్ లిస్ట్ అయింది. అంతే కాకుండా, Cannes Film festival 2022 లో ‘అన్ సెర్టైన్’ విభాగంలో కాన్ జ్యూరీ అవార్డుతో పాటు, ఉత్తమ ఎల్‌జిబిటి సినిమాగా మరో అవార్డు అందుకుంది. టెర్రరిస్ట్ గడ్డ మీద నుంచి వచ్చిన, ఈ రొమాంటిక్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘జాయ్ ల్యాండ్’ 2022లో వచ్చిన పాకిస్తాన్ రొమాంటిక్ డ్రామా సినిమా. సైమ్ సాదిక్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇందులో హైదర్ (అలీ జునేజో), బిబా (ఆలినా ఖాన్), ముమ్తాజ్ (రస్తి ఫారూక్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 మే 23న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2022 నవంబర్ 18 నుంచి పాకిస్తాన్ థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 6 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.6/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
లాహోర్‌లో రానా కుటుంబం సాంప్రదాయ పద్ధతులను పాటిస్తుంటుంది. కుటుంబ పెద్ద అయిన అబ్బాజీ తన కొడుకులు, కోడళ్లు, మనవళ్లతో కలిసి ఉంటాడు. అబ్బాజీకి మగ వారసుడు కావాలనే కోరిక బలంగా ఉంది. అబ్బాజీ చిన్న కొడుకు హైదర్, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటాడు. అతని భార్య ముమ్తాజ్ ఒక ఇండిపెండెంట్ మహిళ. సెలూన్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. కానీ కుటుంబం ముమ్తాజ్ ఉద్యోగం చేయడాన్ని ఇష్టపడదు. హైదర్‌పై ఉద్యోగం సంపాదించమని ఒత్తిడి తెస్తుంది. ఒక రోజు హైదర్, ఒక డాన్స్ థియేటర్‌లో ఉద్యోగం సంపాదిస్తాడు. అక్కడ అతను బిబా అనే ట్రాన్స్‌జెండర్ డాన్సర్‌ని కలుస్తాడు. హైదర్ ఆమెతో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ సన్నిహితంగా మారతాడు. త్వరలోనే హైదర్, బిబాపై ప్రేమను పెంచుకుంటాడు.
ఈ సంబంధం హైదర్ జీవితంలో కొత్త మలుపు తీసుకుంటుంది. అదే సమయంలో ముమ్తాజ్ కుటుంబ ఒత్తిళ్ల కారణంగా తన ఉద్యోగం మానేయాల్సి వస్తుంది. మరోవైపు అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. బిబా మత్తులో పడి హైదర్ తన భార్య బాధలను గమనించలేకపోతాడు. ఎందుకంటే అతను బిబాతో గడిపే సమయంలో మునిగిపోతాడు. హైదర్, బిబా సంబంధం, కుటుంబంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అబ్బాజీ, హైదర్ అన్న నౌమాన్ ఈ సంబంధాన్ని తెలుసుకుని హైదర్ పై కోప్పడతారు. కథలో ఒక ట్రాజిక్ ట్విస్ట్ వస్తుంది. ముమ్తాజ్ తన గర్భాన్ని కోల్పోతుంది. ఇది ఆమె మానసిక స్థితిని మరింత దిగజార్చుతుంది. హైదర్ తన ప్రేమ, కుటుంబ బాధ్యతల మధ్య చిక్కుకుంటాడు. బిబా కూడా సమాజం నుండి వచ్చే వివక్షను ఫేస్ చేస్తుంది. చివరికి కథ ఒక ట్రాజెడీ ముగింపుకు దారితీస్తుంది. ఈ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయం తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్