OTT Movie : ఓటీటీలో కొరియెన్ సినిమాలను తెగ చూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ప్రపంచవ్యాప్తంగా కూడా వీటికి ఆదరణ పెరుగుతోంది. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దీంతో ఈ స్టోరీలు మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఒక సైకలాజికల్ హారర్ సినిమా సౌండ్ థీమ్‌తో ఆడియన్స్ ని భయపెడుతోంది. ఈ కథ ఒక కొత్త ఇంట్లోకి మారికా అక్కాచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లో ఒక వింత శబ్ధం వస్తుండటంతో, అసలు స్టోరీ మొదలవుతుంది. క్లైమాక్స్ వరకు ఈ సినిమా చిల్లింగ్ థ్రిల్ తో ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘నాయిస్’ 2024లో వచ్చిన కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా. దీనిని కిమ్ సూ-జిన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో లీ సన్-బిన్ (జూ-యంగ్), హాన్ సూ-ఆ (జూ-హీ), కిమ్ మిన్-సోక్ (కిహూన్) మెయిన్ యాక్టర్స్ గా ఉన్నారు. ఈ సినిమా 2025 జూన్ 25న కొరియన్ థియేటర్స్‌లో విడుదలైంది. 1 గంట 35 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, IMDb 5.6/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం Netflix లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
జూ-యంగ్, ఆమె చెల్లి జూ-హీ, కొరియాలో ఒక కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారతారు. అక్కడ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. కానీ రాత్రిళ్లు అపార్ట్‌మెంట్‌లో విచిత్రమైన సౌండ్ వస్తుంది. జూ-హీ ఈ సౌండ్ వల్ల బాగా భయపడుతుంది. నిద్రపోలేక స్ట్రెస్ అవుతుంది. జూ-యంగ్ ఆమెను సముదాయిస్తుంది. వాళ్ళు డౌన్ స్టెయిర్స్ లో ఉన్న ఒక నెయిబర్ ని ఈ విషయం గురించి అడుగుతారు. అతను కూడా అలాంటి సౌండ్ విన్నానని చెబుతాడు. ఈ సమయంలో జూ-హీ సడన్‌గా మిస్సింగ్ అవుతుంది. జూ-యంగ్ షాక్ అయి, ఆమెను వెతకడం మొదలుపెడుతుంది. ఆమె జూ-హీ బాయ్‌ఫ్రెండ్ కిహూన్ తో కలిసి, ఈ వింత శబ్ధం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
వీళ్ళు అపార్ట్‌మెంట్‌లోని నెయిబర్స్ ని దీని గురించి అడుగుతారు. కానీ అందరూ విచిత్రంగా బిహేవ్ చేస్తారు. జూ-యంగ్ ను ఈ నాయిస్ తో మరింత ఇంటెన్స్‌గా ఫీల్ అవుతుంది. ఆమెకు హాల్యుసినేషన్స్ స్టార్ట్ అవుతాయి. స్టోరీ నడుస్తున్న కొద్దీ, జూ-యంగ్, కిహూన్ ఈ సౌండ్ వెనక సీక్రెట్ కనిపెడతారు. ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక సూపర్ నాచురల్ పవర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపులతో ఉత్కంఠంగా సాగుతుంది. చివరికి ఈ సూపర్ నాచురల్ పవర్ ఎలాంటిది ? ఎందుకు జూ-యంగ్ ఇంటిని టార్గెట్ చేసింది ? ఆమె చెల్లి జూ-హీ మిస్సింగ్ మిస్టరీ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ప్రియుడితో సీక్రెట్ గా ఆ పాడు పని… భర్త ఎంట్రీతో మైండ్ బెండయ్యే ట్విస్టు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా