BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.? ఏ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూల ఫలితాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. శత్రువులు తప్పుదోవ పట్టించే అవకాశం. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. కొన్ని పనుల్లో అంతరాయం కలగవచ్చు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. దుర్గారాధన మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. కీలక వ్యవహారాల్లో అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. వ్యాపారంలో మరింత లాభాలు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు ఉంటాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.


మిథునం:
మిథునం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు వరిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. వ్యాపారంలో విక్రయాలు జోరుగా సాగుతాయి. ఇష్టదైవారాధన మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆలోచనతో సమయానికే పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. పెద్దల సలహాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులు, మిత్రుల పోత్సాహం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.

సింహం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు నెరవేరుతాయి. కీలక వ్యవహారాల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో వాదనలు మంచివి కావు. చెడు విషయాలపై కఠినంగా ఉండాలి. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మంచిది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. శత్రువులు తప్పు పట్టించే అవకాశం ఉంది. మిత్రుల సహకారం ఉంది. అనారోగ్యానికి గురవుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించాలి.

తుల:
తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తోటి ఉద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. మోహమాటాలకు పోకూడదు. గోసేవ చేయడంతో కష్టాలు తొలగిపోతాయి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. మనోబలంతో విజయం సాధిస్తారు. ఆవేశం, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇతరులతో ఆచితూచి వ్యహరించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శని ధ్యానం చేయడం ఉత్తమం.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో బుద్దిబలంతో పని చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ , స్థాన చలనం ఉంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. విష్ణు నామస్మరణ శుభప్రదం.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలను చూసుకోవడం మంచిదిత. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఇబ్బంది కలిగించవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి.

కుంభం:  
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మోహమాటాలకు పోకూడదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా మంచిది. దైవారాధన మానవద్దు.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రావాలంటే అప్రమత్తంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. అసహనం, కోపం, దురుసుగా ప్రవర్తించవద్దు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. హనుమాత్ ఆరాధన శుభప్రదం.

Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×