IND VS WI: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము లేపుతున్నారు. ఈ మ్యాచ్ లో ముగ్గురు సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఇవాళ ఉదయం కే ఎల్ రాహుల్ సెంచరీ చేయగా… కాసేపటి క్రితమే జురెల్ అలాగే రవీంద్ర జెడ్ చేయకుండా సెంచరీలు నమోదు చేశారు. దీంతో టీమిండియా 450 కి పైగా పరుగులు చేసింది. అదే సమయంలో 282 పరుగుల లీడు సాధించింది. రవీంద్ర జడేజా 168 బంతుల్లోనే సెంచరీ చేసి రఫ్పాడించాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా అలాగే మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్నారు.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో టీం ఇండియాకు మంచి కాంట్రిబ్యూట్.. అందించి జట్టును గెలిపిస్తున్నాడు. ఇవాళ వెస్టిండీస్ జట్టుపై సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు రవీంద్ర జడేజా. కేవలం 168 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు రవీంద్ర జడేజా. ఈ సెంచరీ తో తన ఖాతాలో ఆరు సెంచరీలు నమోదు చేసుకున్నాడు. ఇప్పటికే 27 హాఫ్ సెంచరీలు కూడా టెస్ట్ కెరీర్ లో పూర్తి చేశాడు. అద్భుతంగా రవీంద్ర ఏడైతే రాణిస్తున్న నేపథ్యంలోనే టెస్ట్ క్రికెట్ లో ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. గడిచిన 9 ఇన్నింగ్స్ లలో.. రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు అలాగే రెండు సెంచరీలు ఉన్నాయి.
టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తనకు వచ్చిన అవకాశాన్ని తాజాగా సద్వినియోగం చేసుకున్నాడు. వెస్టిండీస్ జట్టుపై అద్భుతమైన సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇవాళ ఉదయం కేఎల్ రాహుల్ సెంచరీ చేయగా మధ్యాహ్నం ధ్రువ్ జురెల్ సెంచరీ చేయడం గమనార్హం. 190 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన జూలై… 125 పరుగులకు అవుట్ అయ్యాడు. అయితే సెంచరీ నమోదు చేసిన తర్వాత తన తండ్రికి… తన మొదటి సెంచరీ అంకితం చేశాడు ధ్రువ్ జురెల్.
RAVINDRA JADEJA IN LAST 9 TEST INNINGS:
– Fifty.
– Fifty.
– Fifty.
– Fifty.
– 20(40).
– Hundred.
– 9(13).
– Fifty.
– Hundred*.Insane Consistency by Sir Jadeja. 🥶🫡 pic.twitter.com/N6WoxJdQvw
— Tanuj (@ImTanujSingh) October 3, 2025