E-Paper
Advertisement

Rahu Transit 2024: రాహువు సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం

Rahu Transit 2024: రాహువు సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం
Advertisement

Rahu Transit 2024: ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు సంచరిస్తున్నాడు. సుమారు ఎనిమిది నెలల పాటు రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. జులై 8వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహువు ప్రవేశించాడు. 2025 మార్చి 16వ తేదీ వరకు ఈ నక్షత్రంలోనే సంచరిస్తాడు. ఇది కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర భాద్రపదంలో రాహువు సంచారం ఏ రాశుల వారికి లాభపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి :
రాహువు సంచారం వల్ల రానున్నఎనిమిది నెలల్లో మేషరాశి వారికి కలిసి వస్తుంది. వీరికి వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశముంది. మీరు చేసే పనుల్లో మద్దతు కూడా లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. భూములు, ఇళ్లు కొనాలనుకునే ప్రయత్నాలు చేసే వారికి ఎదురుచూపులు ఫలించే అవకాశం ఉంది. మీ కుటుంబ బంధం మరింత మెరుగుపడుతుంది.
కుంభ రాశి :
ఈ కాలంలో కుంభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చాలా కాలం నుంచి రావాల్సిన ధనం తిరిగి పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. న్యాయపరమైన కేసుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

Advertisement

Also Read: జులై 16 నుంచి ఈ రాశుల వారికి కష్టాలు.. జాగ్రత్త సుమా !

కన్యా రాశి :
ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహు సంచారం వల్ల కన్యా రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒత్తిడి సమస్య నుంచి బయటపడతారు. మీ వైవాహిక బంధం మెరుగుపడుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం చేసే చోట ప్రశంసలు పొందుతారు.

Advertisement

 

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×