Ramcharan -Upasana: మెగా కుటుంబానికి సంబంధించి ఇటీవల కాలంలో వరుసగా శుభవార్తలు బయటకు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మెగా ఇంట్లోకి బుల్లి వారసుడు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు సెప్టెంబర్ 10వ తేదీ పండంటి మగ బిడ్డ జన్మించారు. ఈ చిన్నారికి ఇటీవల నామకరణం వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే ఈ చిన్నారికి వాయువ్ తేజ్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా మెగా కాంపౌండ్ కు సంబంధించి మరొక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన లేదు కానీ రామ్ చరణ్ తాజాగా రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసన రాంచరణ్ లకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఫోటోలో భాగంగా రామ్ చరణ్ ఉపాసన చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉపాసన తన పొట్ట కనపడకుండా చున్నీతో మొత్తం కవర్ చేయడంతో కచ్చితంగా ఈమె మరోసారి తల్లి కాబోతుందని అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ ఒక వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ(Second Pregnancy) గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇది మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మెగా కాంపౌండ్ నుంచి అధికారక ప్రకటన వెలవడాల్సి ఉంది.
మొదటి సంతానంలో అమ్మాయి..
ఇక రాంచరణ్ కు కొడుకు పుట్టాలని మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు ఇటీవల ఒక కార్యక్రమంలో ఈయన ఈసారి కొడుకును కనురా..ఇల్లు మొత్తం మనవరాళ్లతో లేడీస్ హాస్టల్ లాగా ఉంది అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ గా మారడంతో మెగా వారసుడు రాబోతున్నారా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ పుకారు కూడా నిజం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇదివరకే క్లిన్ కారా(Klin Kaara) జన్మించిన సంగతి తెలిసిందే . ఇలా మొదటి సంతానంలో అమ్మాయి పుట్టడంతో ఈసారి అబ్బాయి పుట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా(Peddi Movie) పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: Akshay Kumar: కూతురిని అలాంటి ఫొటోలు పంపమని అడిగాడు.. పోలీసులను ఆశ్రయించిన అక్షయ్ కుమార్