Flipkart Festive Dhamaka| ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ మరోసారి కస్టమర్ల కోసం భారీ ఆఫర్లతో వస్తోంది. దసరా పండుగ స్పెషల్ సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 2న ముగిసింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా “Flipkart Festive Dhamaka 2025” సేల్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 4న రాత్రి 12 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 8 రాత్రి 11.59 గంటలకు ముగియనుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ లైవ్‌లో ఉంది.
ఈ కొత్త సేల్‌లో కూడా కస్టమర్లకు పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు లభించనున్నాయి.
ఈ సారి ఫ్లిప్‌కార్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యంగా, iPhone 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
iPhone 16: అసలు ధర ₹69,999. ఇప్పుడు ఫెస్టివ్ ధమాకా సేల్‌తో కేవలం ₹56,999 అందుబాటులో ఉంది.
iPhone 16 Pro: అసలు ధర ₹1,09,999. ఇప్పుడు సేల్ ధర ₹85,999కే లిస్ట్ అయింది. అంటే ఏకంగా రూ.14000 డిస్కౌంట్.
iPhone 16 Pro Max: సేల్ ధర ₹1,04,999. ఇంత భారీ డిస్కౌంట్‌లు చూసి యాపిల్ ఫ్యాన్స్ కచ్చితంగా ఆకర్షితులవుతారు.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తున్న మరో ముఖ్యమైన ఫోన్ Samsung Galaxy S24 (Snapdragon variant). దీని అసలు ధర ₹74,999. కానీ సేల్‌లో కేవలం ₹38,999 నుంచి లభిస్తుంది.
అలాగే Samsung Galaxy S24 FE కూడా అందుబాటులో ఉంది. దీని ధర ₹59,999 నుంచి ₹29,999కి పడిపోయింది.
ప్రీమియం ఫోన్లతో పాటు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లపైనా ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది.
Motorola Edge 60 Fusion: అసలు ధర ₹25,999. ఇప్పుడు కేవలం ₹18,999.
Samsung Galaxy S24 (Snapdragon): ₹38,999 నుంచి ప్రారంభం.
బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి.
Motorola G96: అసలు ధర ₹20,999. ఇప్పుడు ₹15,999.
Vivo T4x: అసలు ధర ₹17,999. ఇప్పుడు కేవలం ₹12,499 నుంచి ప్రారంభం.
ఈ సేల్‌లో కేవలం డైరెక్ట్ డిస్కౌంట్లు మాత్రమే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EasyEMI కార్డ్ ద్వారా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే పాత ఫోన్‌ను ఇచ్చి కొత్త ఫోన్ కొంటే అదనపు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది.
దాదాపు ప్రతి సంవత్సరం జరిగే ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ సేల్ ఈసారి కూడా భారీ ఆఫర్లు ఉంటాయని కంపెనీ ఇప్పటికే చెప్పింది. ప్రత్యేకంగా iPhone, Samsung Galaxy వంటి హైఎండ్ ఫోన్లపై ఈ రేంజ్‌లో డిస్కౌంట్ రావడం చాలా అరుదు.
కాబట్టి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారు ఈ సేల్‌ను మిస్ కాకుండా ముందుగానే విష్ లిస్ట్ సిద్ధం చేసుకోవాలి. అక్టోబర్ 4 నుండి 8 వరకు కేవలం 5 రోజులే అందుబాటులో ఉంటుంది కాబట్టి టైమ్ వృథా కాకుండా డీల్స్ పట్టుకోవాలి.
Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి