BigTV English

How to Become a Buddha : మనమూ బుద్ధుడిగా మారటం ఎలా?

How to Become a Buddha : మనమూ బుద్ధుడిగా మారటం ఎలా?
How to Become a Buddha

How to Become a Buddha : బుద్ధుడు ఓ రోజు ఓ గ్రామం మీదుగా వెళుతున్నాడు. ఆయన తత్వం అర్ధంకాని వారికి ఆయన ఒక పనీపాటా లేని సోమరిలా అనిపించాడు. పైగా బోధనల పేరుతో ప్రజలను చెడగొడుతున్నాడని అనుకున్నారు. ఈయన మాటలు వింటే.. కొన్నాళ్లను జనం పనీ పాటా లేకుండా ఆయనలాగే సన్యాసుల్లా మారతారని భావించి, ఆయన వచ్చే దారిలో కాపుకాసి అడ్డగించి నానా తిట్లూ తిట్టారు.


బుద్ధుడు వాటిని ప్రశాంతంగా విని.. ‘మీరంతా నాకోసం ఇంతదూరం వచ్చి, ఇంత సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు. నేనిపుడు మరో ఊరు వెళ్లాలి. అక్కడా మీలాగానే కొందరు నాకోసం ఎదురు చూస్తున్నారు. నేను రేపు వచ్చి మీరింకా ఏమైనా అనదలచుకుంటే అవన్నీ వింటాను’ అన్నాడు. వారంతా నిర్ఘాంత పోయారు. ‘ఏమిటీ మనిషీ!? అసలు ఈయన మనిషేనా’ అని వారికి అనిపించి, ‘ సరే! కనీసం ఈ ఒక్క మాట చెప్పు. మేం ఇన్ని తిట్లు తిడుతుంటే.. ఒక్కదానికీ స్పందించకుండా అంత ప్రశాంతంగా ఎలా విన్నావు’ అని అడిగారు.

‘నిజమే! మీకు నా జవాబు కావాలంటే 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉండాల్సింది.. నావద్దకి. కానీ.. ఈ శరీరంలో ఇప్పుడు ఆ పాత మనిషి లేడు’ అన్నాడు. ఈ పదేళ్ళలో నాలో ఇతరులవల్ల ప్రభావితం కావటం అనే లక్షణం పోయింది. ఇప్పుడు నాపై నేను మాత్రమే అధికారిని. ఇతరుల ప్రభావాలను పక్కనబెట్టి నాకు నచినట్టుగా నేను ప్రవర్తించగలుగుతున్నాను. నా అంతర్గత అవసరాలకు అనుగుణంగా నేను నడుచుకొంటానని వారికి వివరించాడు.


ఇంకా.. ‘మీరు నన్ను తిట్టాలనుకున్నారు. తిట్టారు. అందుకు మీరు సంతోష పడండి. మీ పని మీరు చక్కగా చేశారు.. ఐతే ఆ అవమానాన్ని నేను స్వీకరించలేదు. అలా స్వీకరించనంత వరకు నాకది అర్ధరహితమైనదే కదా. ఒకవేళ మీ మాటలకు నేను స్పందించి ఉంటే.. ఆ మాటలను, అవమానాన్ని స్వీకరించినట్లయ్యేది. నేను ఆ పనిచేయలేదు కాబట్టి మీరు అన్న మాటలన్నీ మీవే’ అన్నాడు.

దానివల్ల రోజూ ఎవరో ఒకరు మిమ్మల్ని అవమానిస్తారు. దాంతో మీకు కోపమొస్తుంది. లేదా వేరెవరో మిమ్మల్ని పొగుడుతారు. దాంతో మీరు సంతోష పడతారు. ఎవరో మిమ్మల్ని కించ పరుస్తారు. మీరు దానికి కుంగిపోతారు.. ఇలా రోజూ మీరు ఇతరుల చర్యలకు స్పందిస్తూ మీ జీవితాన్ని నెట్టుకొస్తుంటే.. ఇక ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. బాధ పెట్టగలరు. మీలో ద్వేషాన్ని రగిలించగలరు. మిమ్మల్ని పిచ్చివారినీ చేయగలరు. ఇలా ఇతరుల చర్యలకు స్పందిస్తున్నంత కాలం.. మీ జీవితం మీ చేతిలో లేనట్టే. మీరు సొంత నిర్ణయాలే చేయలేరు. దీనివల్ల మీ నిర్ణయాలన్నీ ఇతరుల ప్రభావంలో పడిపోతాయి.

‘కాబట్టి జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే ముందు నిశ్శబ్దంగా కూర్చోండి. అంటే.. సోమరిగా అని కాదు. మనసును అనవసరమైన విషయాల నుంచి మళ్లించి ప్రశాంత మానసిక స్థితిని పొందండి. దానివల్ల మీకు ఏది కావాలో అది మాత్రమే స్వీకరిస్తారు. స్పృహలో లేని వ్యక్తే అన్నిటికీ స్పందిస్తాడు. బుద్ధిజీవి దీనిని గమనించగలుగుతాడు. అతడి అంతర్గత శాంతినుండి నిశ్శబ్దంనుండీ..గొప్ప ఎరుక పుడుతుంది. అదే జ్ఞాన మార్గంలో అతడిని నడిపిస్తుంది’ అన్నాడు. దీంతో గ్రామస్తులంతా బుద్ధుడి పాదాలకు నమస్కరించి దారి వదిలారు.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×