Bigg Boss 9 Telugu Day 22 Episode: బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ రోజు స్నేహితులుగా ఉన్నవాళ్లు రేపు శత్రువులు అవ్వొచ్చు. అసలు పడని వారు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. సోమవారం ఎపిసోడ్ లో అదే జరిగింది. మొన్న సంజన కోసం తనకేంతో ఇష్టమైన కాఫీ త్యాగం చేసిన తనూజ.. ఫుడ్ విషయంలో సంజనకు కండిషన్ పెట్టింది. ఈ వారం ఫుడ్ మానిటర్ గా ఉన్న తనూజని పర్మిషన్ తో తనకు నచ్చింది చెయించుకుంటానని రిక్వెస్ట్ చేసింది.
అయితే, ఈ విషయంలో దివ్య, డిమోన్ నుంచి అభ్యంతరం రావడం లేదు. పోప్ పెట్టుకుంటానంటూ అడగ్గా.. ఇంగీరియంట్స్ లేవు తనూజ చెప్పిన సంజన వినలేదు. రేషన్ ఏమున్నాయొ చూపిస్తున్న సంజనపై తనూజ అసహనం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య ఆర్గ్యూ పెరగడంతో సంజన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నాకు బ్రేక్ ఫాస్టే వద్దు.. తినడానికి కూడా బిక్ష వేయాలా? అంటూ అసహనంతో కన్నీరు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో సంజన ఇక బ్రేక చేయనని మొండికేసింది. హౌజ్ ఉపీరి పీల్చుకోవడానికి కూడా పర్మిషన్ కావాలా? నేను ఇక ఓనర్స్ ఫుడ్ తినను అంటూ కన్నీరు పెట్టుకుంది. సంజన అలగడంతో మాస్క్ మ్యాన్ హరీష్.. తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మీకు ఏ బాధ వచ్చినా.. నాకు చెప్పండంటూ ఓదార్పునిచ్చారు. దీంతో బ్రేక్ ఫాస్ట్, ఫుడ్ తిననంటూ అలిగింది. ఇమ్మాన్యుయేల్, హరీష్, పవన్ కళ్యాణ్ లు ఆమెను ఓదార్చి ఫుడ్ తినిపించారు. సంజనకు టెనెంట్స్ కోసం వచ్చిన ఫుడ్ ని ఇచ్చారు. అయితే టెనెంట్స్ ఫుడ్ ని సంజనకు ఇవ్వడంపై కెప్టెన్ డిమోన్ పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కసారి.. ఒక్కరికి అంటే ఒకే. రేపు ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా.. నేను తినను బయట ఫుడ్ తింటానంటే.. అందరికి టెనెంట్ ఫుడ్ ఇవ్వడం కుదురదు. అందుకే సంజన గారు ఓనర్స్ ఫుడే తినాలి.. టెనెంట్స్ ఫుడ్ ఇవ్వడానికి ఒప్పుకోను అనడంతో.. సంజన, డిమోన్ పై ఫైర్ అయ్యింది.
నా స్థానంలో తనూజ, రీతూ, శ్రీజ ఎవరైనా ఉంటే నీకు ప్రాబ్లమ్ ఉండేది కాదు.. నేను కాబట్టి నువ్వు దీన్ని వ్యతిరేకిస్తున్నావ్ అంటూ డిమోన్ పై విరుచుకుపడింది. అలా ఏడుస్తూ బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. నామినేషన్స్ కంటే ముందు.. బిగ్ బాస్ ఇమ్మునిటీ పవర్ టాస్క్ ఇచ్చాడు. … దీనికి సంచాలక్ గా డిమోన్ పవన్ ఉన్నాడు. టీంకి ఇద్దరు చొప్పున ఆరుగురుగా విడిపోవాలి. పెయిర్ గా విడిపోయి.. ఈ టాస్క్ లో ఆడాలి. మొదటి లెవల్లో గెలవాలంటే పోటీ దారులు.. యాక్టివిటీ రూంలో అమర్చిన స్లోప్ ఎక్కి చివరిలో అమర్చిన మూడింటిలో రెండు తీసుకోవాలి.
అవి తీసుకోలేని వారు మొదటి లెవల్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అయితే స్టార్స్ తీసుకోవాలంటే స్లోప్ పై ఉన్న స్క్వేర్ బాక్స్ ని పగలగొట్టి ఎక్కాల్సి ఉంటుంది. ఏ ఒక్క బాక్స్ మిగిలిన వారు డిస్ క్వాలిఫై అని కండిషన్ పెట్టారు. అలా మొదటి రౌండ్ లో ఇమ్మాన్యుయేల్, సంజన టీంగా, సుమన్ శెట్టి, దివ్యలు టీంగా పాల్గొన్నారు. ఈ రౌండ్ లో సుమన్ శెట్టి, దివ్య టీం గెలిచింది. ఇక రెండో రౌండ్ లో భరణి, తనూజ టీం.. ఫ్లోరా,హరీష్ లు టీంగా పాల్గొనగా.. రెండు టీం ఫౌల్ గేమ్ ఆడి డిస్ క్వాలిఫై అయ్యారు. అలాగే థర్డ్ రౌండ్ లో కూడా శ్రీజ, రాము టీంగా.. రీతూ, పవన్ లు టీంగా అడగా.. వీరు కూడా ఫౌల్ గేమ్ ఆడి డిస్ క్వాలిఫై అయ్యారు. దీంతో సంచాలక్ డిమోన్ పవన్ రెండు టీంలను డిస్ క్వాలిఫైగా ప్రకటించాడు.