OTT Movie : బ్లడ్ బాత్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఒక భారీ అడవి పంది, మనుషులను భయంకరంగా చంపుతూ తిరుగుతుంటుంది. ఒక ఫార్మ్ హౌస్ లో ఫ్యామిలీని టార్గెట్ చేయడంతో కథ ఉత్కంఠంగా మారుతుంది. క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. ఈ ఆస్ట్రేలియన్ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘Boar’ క్రిస్ సన్ దర్శకత్వం వహించిన ఆస్ట్రేలియన్ హారర్ చిత్రం. ఇందులో నాథన్ జోన్స్, జాన్ జర్రట్, బిల్ మోస్లీ, మెలిస్సా ట్కౌట్జ్, బ్రిట్టెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 96 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా IMDbలో 5.1/10 రేటింగ్ పొందింది. 2017 జూన్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆస్ట్రేలియాలో ఉండే ఒక గ్రామీణ ప్రాంతంలో, ఒక భారీ సైజు అడవి పంది జంతువులను, మనుషులను భయంకరంగా చంపుతూ ఉంటుంది. ఈ సమయంలో ఒక జంట రోడ్డుపై డ్రైవ్ చేస్తుండగా, ఈ పంది వాళ్ళ ట్రక్కును ఢీకొట్టి చంపేస్తుంది. ఇదే సమయంలో డెబ్బీ, ఆమె భర్త బ్రూస్, పిల్లలు ఎల్లా, బార్ట్, ఎల్లా సెలవుల్లో తమ ఫామ్‌ను సందర్శించడానికి వస్తారు. ఈ ఫార్మ్ ను డెబ్బీ సోదరుడు బెర్నీ చూస్తుంటాడు. ఈ కుటుంబం ఫామ్‌లో ఉన్నప్పుడు, అడవి పంది దాడులు పెరుగుతాయి. ఇది సమీపంలోని పశువులను చంపడం మొదలు పెడుతుంది. చుట్టుపక్కల ఉండే రైతులు కనుమరుగవుతారు. అయితే వీళ్ళంతా మొదట్లో దీనిని సాధారణ అడవి పంది సమస్యగా భావిస్తారు. అయితే పంది భారీ సైజు, దాని ఘోరమైన దాడుల గురించి త్వరలోనే తెలుస్తుంది.
ఒక రాత్రి డెబ్బీ కుటుంబం, స్థానికంగా ఉండే ఒక పబ్‌లో అడవి పంది గురించి చర్చించుకుంటారు. ఈ సమయంలో పంది మరో దాడిని చేస్తుంది. ఒక స్థానిక వ్యక్తిని క్రూరంగా చంపుతుంది. అతని శరీరం ముక్కలైన స్థితిలో కనిపిస్తుంది. ఈ సంఘటన ఈ కుటుంబాన్ని, స్థానికులను భయాందోళనలో పడేస్తుంది. ఇక క్లైమాక్స్ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఎందుకంటే పంది బెర్నీ ఫామ్‌కు దగ్గరగా వస్తుంది. వీళ్ళంతా ఈ జంతువును ఎదుర్కోవడానికి ఒక ప్లాన్ వేస్తారు. తుపాకులు, ఉచ్చులు, ఇతర ఆయుధాలతో సిద్ధమవుతారు. కానీ పంది శక్తి, వేగం వారిని ఆశ్చర్యపరుస్తుంది. డెబ్బీ తన పిల్లలను రక్షించడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. బెర్నీ తన శక్తిని ఉపయోగించి పందితో తలపడి, తీవ్రంగా గాయపడతాడు. అక్కడ ఒక భయంకరమైన వాతావరణం ఉంటుంది. చివరకు ఈ కుటుంబం పందిపై విజయం సాధిస్తారా ? దానికి బలవుతారా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా