E-Paper
Advertisement

Love Tragedy: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. రైలు కింద పడి లవర్స్ సూసైడ్

Love Tragedy: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. రైలు కింద పడి లవర్స్ సూసైడ్
Advertisement

Love Tragedy: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముందురోజు యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలిసి యువతి మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకుంది.

ఏపీలోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దమ్మాలపాడుకు చెందిన గోపి నరసరావుపేట ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. తెనాలి మండలం అత్తోటకు చెందిన తన క్లాస్ మేట్ ప్రియాంక, గోపి గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు.

ప్రేమ పెళ్లి

Advertisement

సెప్టెంబర్ 5న ఇంట్లో తెలియకుండా గోపి, ప్రియాంక వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి మాట్లాడారు. అయితే వారు ప్రేమ పెళ్లిని అంగీకరించలేదు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గోపి, ప్రియాంక తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో రెండ్రోజుల క్రితం గోపి పేరేచర్ల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: School Student Tied: ఏడేళ్ల బాలుడిపై ప్రిన్సిపల్ అమానుషం.. తలకిందులుగా కిటికీకి కట్టి డ్రైవర్ తో కొట్టించిన వైనం

ప్రియుడి ఆత్మహత్య విషయం తెలిసి

Advertisement

గోపి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ప్రియాంక ఆ మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్‌పై సూసైడ్ చేసుకుంది. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి గోపి, ప్రియాంకల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లికి ఒప్పుకోలేదని పిల్లలు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనతో గోపి, ప్రియాంక ఇరువురి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×