OG Film : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల 12 సంవత్సరాల ఆకలిని సుజిత్ ఓ జి సినిమాతో తీర్చేశాడు. అయితే ఈ సినిమా విషయంలో కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి పడిన వాళ్ళు కాకుండా కొంతమందికి అసంతృప్తి కూడా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం మాత్రం చాలా మందికి విపరీతంగా నచ్చింది.
గతంలో వచ్చిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ లుక్స్ చూస్తేనే ఏదోలా అనిపించేది. ఈ సినిమాలో సుజిత్ కళ్యాణ్ ను బాగా అందంగా చూపించాడు.
షూటింగ్స్ గ్యాప్ ఇస్తూ చేసినా కూడా కంటిన్యూటి విషయంలో మాత్రం ఎక్కడా డిఫరెంట్ కనిపించలేదు. ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. ఓజి సినిమాకి సంబంధించి మొదటి షో పడినప్పుడు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ఈ సినిమాకు బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా టికెట్ రేట్లు విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎప్పుడు వాటన్నిటికీ పరిష్కారం లభించింది.
ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లు తగ్గించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఈ టికెట్ రేట్లు కొన్నిచోట్ల అధికంగానే ఉన్నాయి. అవి రేపటి నుంచి తగ్గనున్నాయి. టికెట్ రేట్లు తగ్గించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం తెలిపింది. టికెట్ రేట్లు తగ్గాయి కాబట్టి మళ్లీ ఎక్కువ మంది ఆడియన్స్ ఈ సినిమా చూసే అవకాశం ఉంది. రిపీట్ ఆడియన్స్ వస్తే మంచి కలెక్షన్లు కూడా చూడొచ్చు.
ఓ జి సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ ఉన్న విషయం తెలిసింది. అయితే కొన్ని కారణాల వలన పాటలు సినిమాలో పెట్టలేదు. అలానే దీనికి సంబంధించిన వర్క్ కూడా మిగిలి ఉండటం ఒక కారణం.
మొత్తానికి స్పెషల్ సాంగ్ వర్క్ పూర్తయింది.. కంటెంట్ రీ అప్లోడ్ ప్రాసెస్ మొదలైంది.. రేపటి నుంచి సాంగ్ యాడ్ చేస్తున్నారు. ఒకటి టికెట్ రేట్లు తగ్గించడం, మరోవైపు ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ సాంగ్ యాడ్ చేయడం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా కలిసి వస్తుందని చెప్పాలి.
టిక్కెట్ రేట్లు తగ్గాయి కాబట్టి సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు కొందరైతే, అసలు నేహా శెట్టి తో ఎటువంటి సాంగ్ ప్లాన్ చేసి ఏ ప్లేస్మెంట్ పెట్టారు అని చూసే ఆలోచనతో కొందరు ఈ సినిమా వస్తారు. ఇక మళ్లీ రిపీట్ ఆడియన్స్ వచ్చి ఈ సినిమాను ఏ స్థాయిలో నిలబెడతారో కలెక్షన్స్ బట్టి అర్థమవుతుంది.
Also Read: Pawan Kalyan : కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు పెట్టొద్దు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు