BigTV English

Bigg Boss 9: వారధి కట్టు.. ఇమ్మ్యూనిటీ పట్టు.. ట్విస్ట్ అదిరింది.. నామినేషన్స్ నుంచి వారిద్దరు సేవ్

Bigg Boss 9: వారధి కట్టు.. ఇమ్మ్యూనిటీ పట్టు.. ట్విస్ట్ అదిరింది.. నామినేషన్స్ నుంచి వారిద్దరు సేవ్

Bigg Boss Telugu 9 Today Episode: సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్స్ హీట్ ఉంటుంది. కానీ, బిగ్ బాస్ నామినేషన్స్ కంటే ముందు ఇమ్మ్యునిటీ టాస్క్ ఇచ్చాడు కంటెస్టెంట్స్ కి. ఫుడ్ విషయంలో వాడి వేడిగా సాగుతున్న వార్ మధ్య.. బిగ్ బాస్ కూల్ గా ఇమ్మ్యునిటీ టాస్క్ ఇచ్చాడు. ఇమ్మ్యునిటీ కోసం పెట్టిన మొదటి లెవెల్లో కంటెస్టెంట్స్ టీంగా గెలవాల్సి ఉంది. మొత్తం ఆరుగురిలో ఇద్దరు ఇద్దరు చొప్పున మొదటి లెవల్లో టాస్క్ ఆడాల్సి ఉంటుంది. దీనికి కెప్టెన్ డిమోన్ పవన్ సంచాలక్. టీంకి ఇద్దరు చొప్పున ఆరుగురుగా విడిపోవాలి. పెయిర్ గా ఈ టాస్క్ లో ఆడి గెలవాల్సి ఉంటుంది.


గెలిచిన సుమన్ శెట్టి, తనూజ

యాక్టివిటీ రూంలో అమర్చిన స్లోప్ ఎక్కి చివరిలో అమర్చిన మూడింటిలో రెండు తీసుకోవాలి. అవి తీసుకోలేని వారు మొదటి లెవల్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అయితే స్టార్స్ తీసుకోవాలంటే స్లోప్ పై ఉన్న స్క్వేర్ బాక్స్ ని పగలగొట్టి ఎక్కాల్సి ఉంటుంది. ఏ ఒక్క బాక్స్ మిగిలిన వారు డిస్ క్వాలిఫై అని కండిషన్ పెట్టారు. అలా మొదటి రౌండ్ లో ఇమ్మాన్యుయేల్, సంజన టీంగా, సుమన్ శెట్టి, దివ్యలు టీంగా పాల్గొన్నారు. ఈ రౌండ్ లో సుమన్ శెట్టి, దివ్య టీం గెలిచింది. ఇక రెండో రౌండ్ లో భరణి, తనూజ టీం.. ఫ్లోరా,హరీష్ లు టీంగా పాల్గొనగా.. రెండు టీం ఫౌల్ గేమ్ ఆడి డిస్ క్వాలిఫై అయ్యారు.

ఫౌల్ గేమ్ ఆడి అవుటైన రీతూ పవన్

అలాగే థర్డ్ రౌండ్ లో కూడా శ్రీజ, రాము టీంగా.. రీతూ, పవన్ లు టీంగా అడగా.. వీరు కూడా ఫౌల్ గేమ్ ఆడి డిస్ క్వాలిఫై అయ్యారు. దీంతో సంచాలక్ డిమోన్ పవన్ రెండు టీంలను డిస్ క్వాలిఫైగా ప్రకటించాడు. ఆ తర్వాత ఇమ్మ్యునిటీ పవర్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ రెండో లెవల్ పెట్టాడు. దీనికి వారధి కట్టు.. ఇమ్మ్యునిటీ పట్టు. రెండో లెవల్లో ఇమ్మ్యునిటీ పొందాలంటే ఎవరికి వారే పోరాడాలి. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్.. హౌజ్ మేట్స్ ని ఒప్పించి.. వారి బ్రిడ్జ్ ని పూర్తి చేసుకుని.. దాని గుండా వెళ్లి అక్కడ పొడియంపై పెట్టిన ఇమ్మ్యునిటీ బ్యాడ్జస్ పొందాలి. ఇందులో ఇద్దరికి మాత్రమే గెలిచే అవకాశం ఇచ్చాడు.


వారధి కట్టు.. ఇమ్మ్యూనిటీ పట్టు

ఇక ఈ టాస్క్ కి సంచాలక్ గా డిమోన్ పవన్ గా నేరుగా కంటెస్ంట్సే ఎంచుకున్నారు. అయితే ఈ టాస్క్ లో పాల్గొన్న తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, దివ్య కంటెండర్లు పాల్గొన్నారు. బజర్ మోగిన ప్రతి సారి ఒక కంటెస్టెంట్స్ ముందుకు వచ్చిన తమకు నచ్చిన వారికి బ్రిడ్జ్ పూర్తి చేసుకునేందుకు సపోర్టు ఇవ్వోచ్చు. ఇందులో భాగంగా మొదట రౌండ్ లో ఇమ్మ్యాన్యుయేల్ కి అవకాశం ఇచ్చాడు సంచాలక్. ఇక్కడ కంటెండర్లు తమకే ఎందుకు సపోర్టు చేయాలనే వివరణ ఇచ్చుకున్నారు. అలా అందరి అభిప్రాయం విన్న ఇమ్మూ.. తనూజ, సుమన్ శెట్టికి సపోర్టు ఇచ్చాడు.

మొదటి లెవెల్లో సుమన్ శెట్టి.. ఎఫర్ట్స్ పెట్టి అడారన్నారు. తను 100 శాతం ఎఫర్ట్స పెట్టి ఆడటం ఫస్ట్ టైం చూశాను.. కాబట్టి తనకే ఇస్తున్న అన్నాడు. దీనికి దివ్య ఇమ్ముతో డిఫెండ్ చేసుకుంది. ఇద్దరం కలిసి టీంగా ఆడాం.. నేను కూడా ఆడటం వల్లే గెలిచాం. అలాంటప్పుడు ఆయన ఒక్కరే బాగా ఆడారని ఎలా అంటారని దివ్య తనని డిఫెండ్ చేసుకుంది. అయినప్పటికీ ఇమ్మూ సుమన్ శెట్టికే సపోర్టు ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీజ దమ్ము వచ్చింది.. తను కూడా తనూజ, సుమన్ శెట్టికే తన మద్దతు తెలిపింది. ఇక చివరిగా.. భరణి వచ్చి.. తనూజ, సుమన్ శెట్టిలకే సపోర్టు ఇవ్వడంతో వారి వారధి పూర్తయ్యింది. అలా సుమన్ శెట్టి, తనూజలు ఇమ్మ్యునిటీ పవర్ పొంది.. నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు.

Related News

Bigg Boss 9: మళ్లీ రచ్చ మొదలుపెట్టిన సంజన.. తినడానికి బిక్ష అడుక్కోవాలా?.. పాపం తనూజ

Bigg Boss 9 Promo: వారధి కోసం పోరాటం.. నెగ్గేదెవరు?

Bigg Boss 9 Promo: ఇమ్యూనిటీ స్టార్.. కష్టపడ్డా ప్రతిఫలం దక్కలేదే?

Bigg Boss 9: 3వారాలకు గానూ కామనర్ ప్రియాశెట్టి ఎంత రెమ్యూనరేషన్ పొందిందంటే?

Bigg Boss Buzzz : ప్రియా శెట్టిని కడిగిపడేసిన శివాజీ, నోరు తెరవనివ్వకుండా కౌంటర్లు

Bigg Boss 9 : ట్విస్ట్స్, ఎంటర్టైన్మెంట్స్ తో కలర్ ఫుల్ దసరా ఎపిసోడ్

Bigg Boss 9 Promo: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా?

Big Stories

×