BigTV English

Sunday Surya Dev Worship: నేడు సూర్యుడిని ఇలా పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి!

Sunday Surya Dev Worship: నేడు సూర్యుడిని ఇలా పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి!

Surya Dev Worship on Sunday: ప్రపంచం అంతా జీవరాశులతో కలకలలాడడానికి ముఖ్య కారణం సూర్యభగవాణుడు. సూర్యుడు ఒకసారి ఉదయించకపోతే ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారుతుంది. ఈ తరుణంలో అన్ని దేవతల్లో కంటే ముందుగా సూర్యదేవుడిని పూజించడం ఆనవాయితీ, ఇదే హిందు సంప్రదాయం ప్రకారం వస్తున్న ఆచారం. ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యదేవుడికి నమస్కారం చేసిన తర్వతే ఏ పనులు అయినా చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఈ తరుణంలో వారంలో మొదటి రోజు అయిన ఆదివారం నాడు సూర్యదేవుడిని పూజించడం ప్రతీతి. సూర్యభగవానుడిని ఆదివారం నాడు కొన్ని చర్యలు పాటిస్తూ పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.


ముందుగా సూర్య నమస్కారం చేసిన తర్వాతే ఏ దేవతలకు అయినా పూజలు చేయడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. దైవాన్ని పూజించే ముందు అధిపతి అయిన సూర్యుడిని పూజించడం వల్ల మంచిది అని పెద్దలు చెబుతుంటారు. అందువల్ల ఉదయాన్నే సూర్యదేవుడికి ఆర్ఘ్యం చెల్లించి, పూజను ప్రారంభిస్తుంటారు. సూర్య భగవానుడికి ప్రత్యక్షమయ్యే నారాయణుడిగా భావిస్తారు. భక్తితో సూర్యుడిని పూజిస్తే ఇష్ట దేవతలను ఆరాధించడానికి అర్హత ఉంటుందని మహర్షులు పురాణాల్లో వివరించారు.

ఎలా ఆరాధించాలి..?


ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచి స్నానం పూర్తి చేసుకుని రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్యుడికి సమర్పించాలి. అనంతరం సూర్య దేవుడికి నమస్కారం చేసుకుని ఇంట్లో పూజలు నిర్వహించాలి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్రం ప్రకారం ఆదివారం సూర్యదేవుడిని పూజించడం శ్రేష్టమని చెబుతుంది. అందువల్ల ఆదివారం రోజున సూర్యుడికి 12 సార్లు నమస్కారంలు చేయాలి. ఇలా చేయడం వల్ల దరిద్రం వంటి కష్టాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. ఇలా నమస్కారం చేసిన తర్వాత సూర్య భగవానుడికి పారాయణం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. సూర్య దేవుడిని పూజించే సమయంలో స్నానాలు ఆచరిస్తే జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల తలనొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Tags

Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×