IND Vs PAK : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగునుంది. భారత కాలమానం ప్రకారం.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ పూర్తయ్యే సారికి దాదాపు అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. ఫ్రీగా లైవ్ ఎక్కడెక్కడ చూడవచ్చని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ ని డీడీ స్పోర్ట్స్ ఛానల్ లో ఫ్రీగా చూడవచ్చు. అలాగే సోనీ స్పోర్ట్స్ ఛానల్స్, సోనీ లివ్ యాప్ లో కూడా లైవ్ ప్రసారం కానుంది. సోనీ స్పోర్ట్స్ 3 లో హిందీ, సోనీ స్పోర్ట్స్ 4లో తెలుగులో టెలికాస్ట్ అవుతుంది. సోనీ లీవ్ ఓటీటీలో ఉచితంగా చూడాలంటే మాత్రం తప్పకుండా రిచార్జ్ చేయించుకోవాల్సిందే.
Also Read : IND Vs PAK : అర్శ్‌దీప్ సింగ్ పై బ్యాన్…సరికొత్త కుట్రలకు తెగించిన పాకిస్థాన్..!
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టికెట్లు భారీగానే అమ్ముడుపోయాయి. లీగ్ దశలో, సూపర్ 4లో అంతగా సేల్ కానీ టికెట్లు ఫైనల్స్ జరగడం.. అందులో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా ఉండటంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మ్యాచ్ ని డీడీ స్పోర్ట్స్ ఛానల్ లో ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించడం శుభపరిణామం అని చెప్పవచ్చు. లీగ్ దశలో, సూపర్ 4 దశలో డీడీ స్పోర్ట్స్ లో కేవలం సోనీ టీవీలో మాత్రమే మ్యాచ్ లు వచ్చేవి. ఆసియా కప్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే బిగ్ ఫైట్ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉండగా.. మేము ఏమి తక్కువ కాదు అన్నట్టు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. పీసీబీ టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని.. కొంత మంది ఆటగాళ్లు రాజకీయ ప్రసంగం చేశారని.. అసభ్యంగా ప్రవర్తించారని ఇలా రకరకాలుగా నిత్యం ఐసీసీకి ఫిర్యాదు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కి 30 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించగా.. కీలక బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ను ఆసియా కప్ నుంచి బ్యాన్ చేసినట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఇవాళ అర్ష్ దీప్ సింగ్ ఆడకపోవచ్చు. మరోవైపు హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మ్యాచ్ సమయం వరకు గాయం నుంచి హార్దిక్ పాండ్యా కోలుకునే అవకాశాలున్నాయని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియాకి ఒక ఫాస్ట్ బౌలర్ చాలా అవసరం. ఫైనల్ మ్యాచ్ లో జట్టు ఏమైనా ఛేంజ్ అవుతుందా..? లేక అదే ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
భారత జట్టు (అంచెనా) :
సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్తాన్ జట్టు (అంచెనా) :
సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (c), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (wk), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.