Vijayawada Traffic Diversions: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. రేపు(సెప్టెంబర్ 29) దసరా నవరాత్రులలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రంలో కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
1) పున్నమి ఘాట్ ఎంట్రెన్స్ (కుమ్మరిపాలెం సెంటర్)
2) తాడేపల్లి చెక్ పోస్ట్
3 ) ఆర్టీసీ ఇన్ గేట్, కనకదుర్గ ఫ్లైఓవర్ ఎంట్రెన్స్
4) గద్ద బొమ్మ సెంటర్
ఈ నాలుగు ప్రాంతాల వైపు ఆదివారం రాత్రి(సెప్టెంబర్ 28) 7:30 గంటల నుంచి మంగళవారం(సెప్టెంబర్ 30) ఉదయం 10 గంటల వరకు ఎటువంటి వాహనాలను అమ్మవారి గుడి వైపు అనుమతించరు.
1) తాడేపల్లి చెక్ పోస్ట్ నుండి బ్యారేజ్ వైపు వచ్చే వాహనాలను కనకదుర్గ వారధి నుంచి మళ్లిస్తారు.
2) గుంటూరు, కనకదుర్గ వారధి నుంచి భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే వాహనాలను కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.
3) పి.సి.ఆర్ నుండి భవానిపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే వాహనాలను గద్ద బొమ్మ మీదగా, కాళేశ్వరం మార్కెట్, పంజా సెంటర్, వీజీ చౌక్, చిట్టినగర్, స్వరంగం మీదుగా మళ్లించారు.
4) పున్నమి ఘాట్, కుమ్మరిపాలెం నుండి నగరంలోకి వచ్చే వాహనాలను గుప్తా సెంటర్ మీదగా సితార జంక్షన్, స్వరంగం, చిట్టినగర్, ఎర్రకట్ట, బి.ఆర్.టి.ఎస్ వైపుగా మళ్లించారు.
5) ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, వైపు నుండి నగరంలోకి ప్రవేశించే వాహనాలను గొల్లపూడి వై జంక్షన్ మీదగా సితార జంక్షన్, సీవీఆర్ ఫ్లై ఓవర్, పైపులు రోడ్డు, సింగ్ నగర్ వైపు మళ్లించారు.
6) విజయవాడ సిటీ నుండి, ఆర్టీసీ ఇన్ గేట్ వైపు రాష్ట్ర సచివాలయానికి, హైకోర్టుకు, అమరావతి వైపు వెళ్లే వాహనాలను కనకదుర్గ ప్లె ఓవర్ మీదుగా భవానీపురం, గొల్లపూడి వెస్ట్ బైపాస్ మీదగా లేదా కనదుర్గ వారధి, తాడేపల్లి మీదగా వాహనాలను మళ్లించారు.
హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి నుంచి వచ్చే పెద్ద వాహనాలకు బొబ్బూరి గ్రౌండ్, పున్నమి ఘాట్, భవానీపురం లారీ స్టాండ్, టీటీడీ ఖాళీ స్థల ప్రదేశం, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు, సోమవారి ఖాళీ స్థలం వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
గద్ద బొమ్మ వరకు వచ్చే కార్లు, బైకులకు కాళేశ్వరం మార్కెట్ సెల్లార్, గాంధీ మున్సిపల్ హై స్కూల్ రోడ్డు వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు వెస్ట్ బైపాస్ మీదుగా, సితార జంక్షన్ దగ్గర పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేశారు. గుంటూరు అవనిగడ్డ మచిలీపట్నం మార్గంలో వచ్చే వాహనాలకు బీఆర్టీఎస్ రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
Also Read: Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక
దూరప్రాంతాలు, విజయవాడ పరిసర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి తమ వాహనాలను నిలుపుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు.