BCCI : ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు ఏదైనా ఉందంటే.. అది బీసీసీఐ అనే చెప్పాలి. ఆ బీసీసీఐ కి తాజాగా కొత్త అధ్యక్షుడు వచ్చారు. మొన్నటి వరకు ఈ పదవీలో రోజర్ బిన్ని కొనసాగాడు. అయితే ఆయన వయస్సు రిత్యా పదవీకి రాజీనామా చేయడంతో ఆయనస్థానంలో మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు. ముంబైలో ఇవాల జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. ఇక 45 సంవత్సరాల వయస్సు ఉన్న మన్హాస్ ఢిల్లీ తరపున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 130 లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడాడు.
Also Read : IND Vs PAK : అర్ష్ దీప్ సింగ్ పై బ్యాన్…సరికొత్త కుట్రలకు తెగించిన పాకిస్థాన్..!
అతను 55 ఐపీఎల్ మ్యాచ్ ల్లో బరిలోకి దిగాడు. బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షుడి పదవులతో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ స్థానాలకు ఒకే ప్యానెల్ నామినేషన్ దాఖలు చేసింది. దీంతో మిథున్ మన్హాస్ అధ్యక్షుడు కాగా.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా మరోసారి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ప్రబ్ తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ ఎన్నికైనట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అపెక్స్ కౌన్సిల్ లో ఇప్పటివరకు జయ్ దేవ్ నిరంజన్ ఏక సభ్యుడిగా ఉండగా.. ఇప్పుడు మరో ఇద్దరినీ బీసీసీఐ ఏజీఎం ఎంపిక చేసింది. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న అరుణ్ ధుమాల్ తో పాటు కైరుల్ జమాన్ మజుందార్ గర్నింగ్ కౌన్సిల్ లోకి వచ్చారు.
అలాగే భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్. శరత్, సుబ్రతో బెనర్జీ స్థానాల్లో ఇద్దరూ టీమిండియా మాజీ క్రికెటర్లు సెలక్టర్లుగా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా, రుద్ర ప్రతాప్ సింగ్ చేరారు. బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో బోర్డు ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ ల నియామకాన్ని ఖరారు చేసింది. ఇక వీరిద్దరూ కూడా టీమిండియా బౌలర్లు కావడం విశేషం. ఒడిశాకు చెందిన ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తరపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ 20లు ఆడాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ టెస్టుల్లో 113, వన్డేల్లో 21, టీ-20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఓజా.. 2015లో రిటైర్మెంట్ అయ్యాడు. మరోవైపు యూపీకి చెందిన టెప్టార్మ్ చేసిన ఆర్పీ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ-20లు ఆడి..ఆయా ఫార్మాట్ లో 40, 69, 15 వికెట్లు తీశాడు. 2005లో ఎంట్రి ఇచ్చి.. 2011లో భారత తరపున చివరి మ్యాచ్ ఆడాడు. 2011లో ఐపీఎల్ కి గుడ్ బై చెప్పాడు.
🚨 THE NEW OFFICE BEARERS OF BCCI 🚨 pic.twitter.com/NYriS4Ymfw
— Johns. (@CricCrazyJohns) September 28, 2025