Upasana Ram Charan : మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఉపాసన అతిపెద్ద కుటుంబంలో పుట్టిన కూడా సామాన్యులతో వ్యవహరించే తీరు చాలామందిని ఆకర్షిస్తుంది. కొన్ని విషయాలపై ఆమె అవగాహన కల్పించిన విధానం చాలామందికి ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇలా ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి.
అన్ స్టాపబుల్ షో కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేసినప్పుడు కూడా ఉపాసన గురించి అనేకమైన ఆసక్తికర విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఆమె గుణానికి నేను పడిపోయాను సార్ అంటూ ఆ షోలో చెప్పడం చాలామందికి ముచ్చటగా అనిపించింది. మొత్తానికి ఈ మెగా కోడలుకు సామాజిక బాధ్యత విపరీతంగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర వాసులు బతుకమ్మ పండుగను ఎంత అద్భుతంగా జరుపుకుంటారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటారు తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగను ఆ స్థాయిలో చేస్తారు. కొన్ని సాంప్రదాయాలు నిజంగా మన సంస్కృతిని గుర్తుచేస్తాయి. మన మూలాలను మర్చిపోనివ్వకుండా చేస్తాయి.
కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా మెగాకోడలు కొణిదెల ఉపాసన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. గుప్తా రేఖ జీ మరియు ఢిల్లీలోని రాంజాస్ కళాశాల విద్యార్థులందరికీ, తెలంగాణ సంస్కృతిని ఇంత ప్రేమ మరియు గౌరవంతో స్వీకరించి జరుపుకున్నందుకు ధన్యవాదాలు. ఈ పండుగ సీజన్‌లో, మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న దేవిని గౌరవిద్దాం మరియు కలిసి మన బలాన్ని జరుపుకుందాం. అంటూ ట్విట్ చేశారు.
Thank you, @gupta_rekha Ji and the students of Ramjas College, Delhi, for embracing & celebrating Telangana culture with such love & respect.
This festive season, let’s honor the Devi within each of us & celebrate our strength together.బతుకమ్మ శుభాకాంక్షలు, नवरात्रि की… pic.twitter.com/OhFxYwQv72
— Upasana Konidela (@upasanakonidela) September 28, 2025
వీటితోపాటు ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు ఉపాసన కొణిదెల. ఈ వీడియోలు తెలంగాణ సంస్కృతి ఢిల్లీలో కూడా ఉట్టిపడుతుంది అని చెప్పే విధంగా ఉంది. బాగా పాపులర్ అయిన బతుకమ్మ పాటను ఈ వీడియోకి అటాచ్ చేశారు. ఈ వీడియో చాలా మందిని ఆకర్షిస్తుంది. చూడముచ్చటగా అనిపిస్తుంది.
Also Read: Spirit: ప్రభాస్ కు ఫాదర్ గా మెగాస్టార్, అలా ఎలా సెట్ చేశావ్ వంగా?